English | Telugu
నేను సుధీర్‌కు లైఫ్ ఇచ్చాను.. కానీ అతను నేను ఫోన్ చేస్తే..
Updated : Jul 16, 2022
జబర్దస్త్ షో రచ్చ మాములుగా లేదు. ఆర్పీ మాట్లాడిన మాటలు ఇప్పుడు కార్చిచ్చులా రగులుతూ జబర్దస్త్ వేదికను తగలబెడుతున్నాయి. ఇప్పటివరకు ఆర్పీకి, కొందరి సీనియర్ కమెడియన్స్, ప్రొడ్యూసర్స్ కి మధ్య జరిగిన వాదోపవాదాలు విన్నాం. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో స్టార్టింగ్ లో మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. "ఆర్పీ షోని వదిలేసి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్?" అని అడిగారు. మల్లెమాలలో ఫుడ్ బాగుంటుంది, పేమెంట్ కూడా రెగ్యులర్ గా టైంకి ఇచ్చేస్తారని చెప్పుకొచ్చాడు.
ఇదే ఇంటర్వ్యూలో సుధీర్, శీనుపై కూడా ఏడుకొండలు ఆరోపణలు చేశారు. "నేను సుధీర్ కి లైఫ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంతలా ఎదగడానికి కారణం నేను. కానీ నేను ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. శీను బయటకి వెళ్లి షోస్ చేయలేడు.. వీళ్లందరి సంగతి నాకు బాగా తెలుసు" అన్నాడు ఏడుకొండలు. ఐతే ఇంత రచ్చకు అసలు కారణం.. షో నుంచి నాగబాబు బయటికి వచ్చేస్తూ ఒకప్పుడు ఆయన కూడా ఇవే మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆర్పీ ఆ మాటలకు ఆజ్యం పోసేసరికి వెనక నుంచి అంతా నడిపిస్తోంది నాగబాబు అని అనుకుంటున్నారంతా.
సుధీర్, ఆది, శీను, రోజా ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోయేసరికి జబర్దస్త్ కళ చాలావరకు తగ్గిపోయింది. మరి ఈ రచ్చ మొత్తాన్ని వెనక ఉండి గమనిస్తున్న నాగబాబు రంగంలోకి దిగుతారా లేదా నాకెందుకులే అని వదిలేసి ఆయన పని ఆయన చూసుకుంటారా ? ఏమో ఇదొక అంతు తేలని ప్రశ్న.