English | Telugu
అసలు మీరు మనుషులా, రాక్షసులా?.. మండిపడిన రష్మీ!
Updated : Jul 16, 2022
రష్మీ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలంటే తనకు ఎంతో ఇష్టం కూడా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుక్క బాధపడడం చూసిందంటే చాలు.. దానికి సేవచేసి, వెంటనే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టేస్తుంది. అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు అలాంటిదే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ మనసు ఈ విషయంలో మాత్రం చాలా గొప్పదని చెప్పొచ్చు. వీధి కుక్కలకు తోచినంత ఫుడ్ పెడుతుంది. వాటికి అవసరమైతే షెల్టర్ కోసం ట్రై చేస్తుంది.
ఐతే కొంత మంది యజమానులు కుక్కల్ని ఇంట్లో పెంచుకుని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడవి వర్షానికి తడుస్తూ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. 24 గంటల్లో నాలుగు జాతులకు చెందిన కుక్కల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడంపై ఆమె ఆగ్రహించింది. "కుక్కతో ఎమోషనల్ బాండింగ్ ఎంతో గొప్పది. అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది కొంచెం కూడా జాలి, దయ, శ్రద్ద లేదా" అంటూ మండిపడింది. ఎవరైతే తమ పెంపుడు కుక్కల్ని వదిలి వెళ్లిపోయారో వాళ్ళను కర్మ వెంటాడుతూ ఉంటుందని హెచ్చరించింది.
"మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అలా రోడ్డు పాల్జేస్తే ఎలా ఉంటుంది?" అనే పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది రష్మీ. ఇక ఏదో తనకు తోచినంతలో హైదరాబాద్, వైజాగ్ లో ఫ్రీ పెట్ డాగ్ రెస్క్యూ వాన్స్ ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. అలాగే ఈ స్టేటస్ తో పాటు మరో స్టేటస్ కూడా పెట్టింది. గంగానది వరదల్లో మావటి ప్రాణాలను కాపాడిన ఏనుగును అతడు ములుగర్రతో బాధించడంపై రష్మీ బాధపడింది. ఇలా రష్మీ మూగ జీవాల సంరక్షణకై నిత్యం పోరాడుతూ ఉండటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.