English | Telugu
సౌందర్య, ఆనందరావు వృద్ధాశ్రమం డ్రామా!
Updated : Jul 19, 2022
సుదీర్ఘ కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్ 'కార్తీక దీపం' మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మంగళవారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. హిమ అన్న మాటల గురించి నిరుపమ్ ఆలోచిస్తూ వుంటాడు. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. "నేను గేమ్ గురించి ఆలోచించినా అది నీకు చెప్పాలా మమ్మీ" అంటాడు. దీంతో సీరియస్ అయిన స్వప్న నీ పెళ్లికి అంగీకరించి తప్పుచేశానని అంటుంది. ఆ మాటలకు వెంటనే నిరుపమ్ సీరియస్ అవుతాడు.
కట్ చేస్తే.. శౌర్య దగ్గరికి వెళ్లిన ఆనందరావు భోజనానికి రమ్మని పిలవగా "నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లండి" అంటుంది. అదే తరహాలో సౌందర్యకు హిమ చెప్పడంతో ఆనందరావు, సౌందర్య ఇద్దరు కలిసి శౌర్య, హిమల గురించి ఆలోచిస్తూ వుంటారు. ఇలా కాదని ఇద్దరం కలిసి వృద్ధాశ్రమానికి వెళ్లిపోతున్నట్టుగా డ్రామా ఆడితే సరి అని ప్లాన్ చేస్తారు. అదే విషయాన్ని హిమ, శౌర్యలకు చెప్పడంతో షాక్ అవుతారు. అయితే ఆ ఇద్దరిని హిమ, శౌర్య వెళ్లడానికి వీళ్లేదని ఆపేస్తారు.
దీంతో "మీరు భోజనం చేయరు, మమ్మల్ని చేయనివ్వరు" అని సౌందర్య అనడంతో "సరే మీరు చెప్పినట్టే చేస్తాం" అని హిమ, శౌర్య చెబుతారు. దీంతో అంతా కలిసి భోజనం చేయడానికి సంతోషంగా లోపలికి వెళతారు. కట్ చేస్తే.. నిరుపమ్ గురించి ఆలోచిస్తూ వుంటుంది శోభ. ఇంతలో బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తాడు. లోన్ కట్టకపోతే హాస్పిటల్ ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎలా చేయాలా? అని శోభ టెన్షన్ పడుతూ వుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.