English | Telugu

నువ్వు పసికందువి కావు, కసికందువి.. నిఖిల్‌పై నిహారిక పంచ్‌!

సుమ కనకాల హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రతీది సందడిగా సాగిపోతుంటుంది. మూవీ ప్రమోషన్స్ కోసం కోసం కూడా నటీనటులు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు క్యాష్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "హలో వరల్డ్" టీం వచ్చింది. నిహారిక, నిఖిల్, నిత్యాశెట్టి , అనిల్ ఈ షోకి వచ్చేశారు. నిహారిక కోసం తన పేరు మీద సాంగ్ నిహారిక, నిహారిక అనే సాంగ్ ప్లే చేసేసరికి "నా పేరు మీద కూడా ఒక పాట ఉంది" అంది సుమ.

"సుమం ప్రతి సుమం" అనే సాంగ్ ప్లే అయ్యింది. నిహారిక ఈ ఎపిసోడ్ లో డాక్టర్ గా చేసింది.ఈలోపు అనిల్.. డాక్టర్ దగ్గరకు వ‌చ్చాడు."ప్రాబ్లమ్ ఏమిటి?" అని అడిగేసరికి "నోటి దూల" అన్నాడు నిఖిల్. తర్వాత నిఖిల్ తల్లి పాత్రలో సుమ చేసింది. నిహారిక వచ్చి "ఆంటీ! నిఖిల్ కి ఎవరో ఇష్టం అంట" అని చెప్పింది. "ఊరుకోమ్మా అసలే చిన్నపిల్లాడు. వాడికి అప్పుడే పెళ్ళేంటి?" అంది సుమ. ఇంతలో నిఖిల్ వచ్చి, "అమ్మా! నేనేమీ ఎరుగని పసికందుని" అన్నాడు.

"నువ్వు పసికందువి కావు, కసికందువి" అని హాస్య‌మాడింది నిహారిక. "అందుకే కాసుకో నిఖిలు.. కాసుకో నిఖిలు అని పెట్టుకున్నావు" అంది సుమ. సుమరాజ్యంలో శివగామిలా సుమ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సుమ తోటలోని కూరగాయలు తిన్నాడు అనిల్. "పర్మిషన్ లేకుండా తిన్నందుకు నీకు రేపు విరేచనాలు అవుతాయి" అని శాపం పెట్టింది సుమ‌. ఇంతలో వేరే రాజ్యం నుంచి సుమ రాజ్యం మీద దండెత్తడానికి వస్తున్నారంటూ ఒకలేఖ వస్తుంది. ఐతే "దండెత్తడానికి ఇప్పుడు వస్తే నాకు టైం లేదు. నెక్స్ట్ మంత్ డేట్స్ ఇస్తాను, అప్పుడు పెట్టుకోమను" అని పంచ్ వేసింది సుమ‌. ఇలా వచ్చే వారం ఎపిసోడ్ సందడి చేయనుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.