English | Telugu
ఎంతపని చేశారు మనో గారు...
Updated : Jul 16, 2022
జబర్దస్త్ వారం వారం సరికొత్తగా ముస్తాబౌతు వస్తోంది. ఐతే ఇప్పుడు వచ్చే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎన్నో ప్రేమ విషయాలను పంచుకున్నారు జడ్జెస్, కమెడియన్స్. చలాకి చంటి, వెంకీ మంకీ ఇద్దరూ కలిసి మంచి స్కిట్స్ పెర్ఫామ్ చేసి అందరిని హూషారెత్తించారు. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటి అంటే వెంకీ మంకీ తన టీమ్ మేట్ గా తన వైఫ్ నే తీసుకొచ్చి స్కిట్ వేసాడు. "ఎన్నెన్నో జన్మల బంధం" సాంగ్ కి డాన్స్ వేశారు ఇద్దరూ. ఆ తర్వాత వెంకీని తన వైఫ్ అడుగుతుంది "స్కిట్ లో అందరిని పట్టుకుని డాన్స్ చేస్తావ్. మరి నన్ను పట్టుకుని డాన్స్ చేయడానికి నీకు బాదేంటి" అని అడుగుతుంది. "అంటే వాళ్ళు మళ్ళీ దొరకరు కదా" అంటాడు "చూస్తున్నా ఈ మధ్య స్కిట్ లో కొత్త కొత్త అమ్మాయిలను తెస్తున్నారట" అని నిలదీస్తుంది.
"అంటే వాళ్లకు పేరు తీసుకొద్దామని" అంటూ కవర్ చేసుకుంటాడు. స్కిట్ ఐపోయాక ఇంద్రజ అడుగుతుంది వెంకీ మంకీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అని..లవ్ మ్యారేజ్ అని, తన భార్య కూచిపూడి డాన్సర్ అని, తానొక మిమిక్రి ఆర్టిస్ట్ అని చెప్తాడు. ముందుగా తన భార్యకు తానే ప్రొపోజ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే స్కిట్ లో తన ఇద్దరి పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేసాడు. వెంటనే వెంకీ కూడా ఇంద్రజాని లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతాడు. లవ్ మ్యారేజ్ అని తన పెళ్ళికి 7500 ఖర్చుతో కేవలం 13 మంది మధ్యలో పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చారు. తర్వాత మను ని కూడా అదే విషయం అడిగేసరికి తాను సంపాదిస్తున్నాని 19 ఏళ్లకే ఇంట్లో పెళ్లి చేసేశారని చెప్పారు. ఐతే మీది బాల్య వివాహమా అంటూ అనసూయ సెటైర్ వేసింది. అనసూయ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నాది మొత్తం తెరిచిన పుస్తకం అంటూ నవ్వేసింది.