English | Telugu
'పాప' పేరు వెనుక కథ!
Updated : Jul 16, 2022
రెజీనా కసాండ్రా పేరు కొంచెం పెద్దదే కానీ చేసిన సినిమాలే చాలా తక్కువ. నటించింది కొన్ని మూవీస్ లోనే ఐనా రెజీనా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. అలీతో సరదాగా షోకి వచ్చి ఎన్నో విషయాలను పంచుకుంది రెజీనా. ఇటీవల 'అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్‌లో నటించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. తనని ఇప్పటికి కూడా అందరు 'పాప' అని పిలుస్తారని చెప్పుకొచ్చింది.
ఈ పాప అనే పేరు వెనుక ఉన్న స్టోరీ కూడా చెప్పింది. తమిళ చిత్రం 'కేడీ బిల్లా కిలాడీ రంగా'లో శివ కార్తికేయన్ తో కలిసి నటించినట్లు తెలిపిన ఆమె, ఈ మూవీలో తన పాత్ర పేరు పాప అనీ, ఈ మూవీలో తన పాత్ర మంచి ఫేమస్ అయ్యేసరికి ఆ పాత్ర పేరుతోనే తనను పిలుస్తున్నారనీ చెప్పుకొచ్చింది. ఇక అమ్మ క్రిస్టియన్, నాన్న ముస్లిం అనీ, రెజీనా పేరుకు అమ్మ కసాండ్ర అని జత చేసిందనీ చెప్పింది. తన ఆరేళ్ళ వయసులో అమ్మ నాన్న ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారని వెల్లడించింది. రెజీనా ఫస్ట్ మూవీ తమిళంలో వచ్చిన 'కంద నాళ్ ముదు'. అదే తెలుగులో 'శివ మనసులో శ్రుతి' (ఎస్సెమ్మెస్)గా వచ్చింది. అందులో రెజీనా హీరోయిన్ గా నటించింది. అలాగే కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ లో కూడా నటించింది రెజీనా. తనది మొదటి నుంచి డామినేటింగ్ మనస్తత్వం అట. ఎవరితో అయినా తనకు ఇబ్బంది వస్తే మాత్రం అస్సలు ఊరుకోనని కూడా చెప్పింది.
ఇక టిఫిన్స్ విషయానికి వస్తే తనకు దోశ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఎక్కువగా రొమాంటిక్ నావెల్స్ ని చదవడం అంటే ఇష్టమట రెజీనాకు. అంతేకాదు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ చాలా ఇష్టమైన హీరోస్ అని, అలాగే రజనీకాంత్ తనకు ఆల్ టైం ఫేవరెట్ అని తన మనసులో మాట చెప్పింది. నటనకు ప్రిఫెరెన్సు ఇచ్చే రాజమౌళి డైరెక్షన్ అంటే ఇష్టమట. ఛాన్స్ వస్తే ఆయన మూవీలో యాక్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.