పరదేశి గుండెపై 'ఐశ్వర్య'
బుల్లి తెర షోస్‌లో పచ్చబొట్ల ట్రెండ్ నడుస్తోంది. లవర్స్ నేమ్స్ శరీరంలో ఎక్కడంటే అక్కడ పచ్చబొట్లుగా పొడిపించేసుకుని, దాని వెనక ఒక స్టోరీని అల్లేసి, షోస్‌లో అదే రియల్ లైఫ్ స్టోరీగా మేకప్ వేసేసి, అందరి చేతా కన్నీళ్లు పెట్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటి వరకు 'జబర్దస్త్' స్టేజి మీద లవ్ పుట్టి, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ప్రపోజ్ చేసుకుని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేసేసుకుని కొత్త ఈవెంట్స్ లో పిల్లలతో వస్తున్నారు చాలా మంది కమెడియన్స్.