English | Telugu

జానీ మాస్టర్ జీవితంలో ఇంత విషాదం ఉందా?

"ఢీ: ది డ్యాన్సింగ్‌ ఐకాన్" షో ప్రతీ వారం సరికొత్తగా దూసుకుపోతూ ఉంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో జానీ మాస్టర్ రియల్ లైఫ్‌ని ఒక సాంగ్ కమ్‌ స్కిట్ రూపంలో వేశారు కంటెస్టెంట్స్. ఆ సాంగ్ చూసేసరికి జానీ మాస్టర్ సెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. జానీ మాస్టర్ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో పరిచయమై ప్రాణ స్నేహితుడిలా ఆదుకున్న సిరాజ్ అనే ఫ్రెండ్ సౌదీ వెళ్లి డబ్బు పంపిస్తానని చెప్పాడు. దాంతో మూవీస్‌లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది అని సిరాజ్ చెప్పేసరికి జానీ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడట.

అదే టైంలో సిరాజ్ ఇండియా వస్తున్నా అని చెప్పడంతో ఆనందపడిన జానీ అంతలోనే ఓ రోడ్డు ప్రమాదంలో సిరాజ్ మరణించాడనే వార్త విని కుంగిపోయాడు. ఆ త‌ర్వాత తన కొడుక్కి ఫ్రెండ్ పేరుపెట్టుకున్నాడు. ఈ విష‌యం చెప్పి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు జానీ.

ఈ న్యూ ఎపిసోడ్ లో "ఢీ డ్యాన్సింగ్‌ స్టార్ జానీ మాస్టర్" అంటూ అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ "రాసుకునే వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే ఏదన్నా రాసుకోండి కానీ ఢీ స్టేజిని మాత్రం అవమానించవద్దు.. చాలా సీరియస్ గా చెప్తున్నా" అంటూ నేల మీదకు వంగి దణ్ణం పెట్టుకున్నాడు.

ఇక ఫైనల్‌గా జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని చోట్ల జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసాడంటే అవి ఫుల్ వైరల్ ఐపోతాయి. ఆ స్టెప్పులు వేసిన‌ స్టార్ కూడా ఫుల్ ఫోకస్ ఐపోతాడు. ఈ మద్యే 'బీస్ట్' మూవీలో విజయ్, పూజా హెగ్డేతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాలో నటిస్తున్నాడు.