హౌస్‌లో ఉత్తమ నటుడు శ్రీహాన్.. ఉత్తమ నటి శ్రీసత్య!
బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో డీజే పాటలకు కంటెస్టెంట్స్ డాన్సులు వేసి ఇరగదీసారు. కెప్టెన్సీ పోటీలో రాజశేఖర్‌కి ఎక్కువ వచ్చాయి. నాలుగు ఓట్లతో ఆయన కెప్టెన్ అయ్యారు. మూడు ఓట్లు ఆర్జే సూర్యకి, రెండు చంటికి, ఒకటి ఇనయకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ హౌస్ లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మూవీ హీరో హీరోయిన్స్ సుధీర్‌బాబు, కృతి శెట్టి వచ్చి సందడి చేశారు.