ఇనయ రెహమాన్ సుల్తానా.. D/O ముజిబుర్ రెహమాన్!
బిగ్ బాస్ మొదటి రోజు పక్కా లోకల్ పాటతో మొదలైంది. తరువాత గలాట గీతుకి, ఇనయ సుల్తానాకి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా క్లాస్, ట్రాష్, మాస్ అని మూడు భాగాలుగా చేసి, అందులో ఎవరు ఉండాలో గ్రూప్ సభ్యులనే ఎన్నుకోమన్నాడు. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. చివరికి ఇనయ సుల్తానా, గలాటా గీతు, రేవంత్ ట్రాష్ గ్రూపుగా ఎన్నికయ్యారు. మిగిలిన వాళ్ళలో క్లాస్, మాస్ గా విభజించారు.