English | Telugu
నేనెప్పుడూ హీరోయిన్ మెటీరియల్ కాదు అని అనుకుంటాను..
Updated : Sep 13, 2022
ఆలీతో సరదాగా షో చాలా ఫన్నీ గా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ వారం మసూదా మూవీ టీం నుంచి కావ్య, సంగీత, తిరువీర్ వచ్చారు. సంగీతను చాలా ప్రశ్నలు అడిగాడు ఆలీ. హీరోయిన్ మెటీరియల్ ని కాదు అని ఎప్పుడూ అనుకుంటావట నువ్వు ఎందుకలా ? అని అడిగేసరికి " ఎందుకంటే నేను చిన్నప్పటినుంచి చాలా లావుగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద బుగ్గలు ఉండేవి. అలాగే స్కిన్ ఇష్యూస్ కూడా నాకు చాలా ఎక్కువ. అందుకే నేనెప్పుడూ అందంగా ఉండను అని నాకు అర్ధమయ్యేది. హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ నాకు లేవు అనిపించేది.
ఇక నాకు ఇండస్ట్రీలో ఎవరితో పెద్దగా పరిచయం లేదు..పెద్ద నెట్వర్క్ కూడా లేదు. తమిళ్ లో చిన్నప్పుడు చేసిన ఒక సినిమాలో నన్ను నేను చూసుకుని నా మొహం అస్సలు బాలేదని ఫీల్ అయ్యాను. ఇంకా నాకు ఒంటి మీద జ్యువెలరీ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ..అందుకే ఈ లక్షణాలు ఏవీ నాలో లేవు కాబట్టి నేను హీరోయిన్ మెటీరియల్ కాదు" అని నా ఫీలింగ్ అని చెప్పింది సంగీత. "ఐతే నీకు అమెరికా వీసా ఉంది కదా అక్కడికి వెళ్లి జేమ్స్ కెమెరూన్ ని కలవు ..అవతార్ పార్ట్ 2 ఐపోయింది కాబట్టి అవతార్ పార్ట్ 3 లో ఛాన్స్ ఇస్తారేమో అడుగు.
ఆ సినిమాలో ఐతే ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోవాల్సిన పని లేదు" అని మంచి కామెడీ సలహా ఇచ్చాడు ఆలీ. ఇక తర్వాత "మసూదా మూవీ స్క్రిప్ట్ చదవకుండానే ఓకే చేసేసాను. ఎందుకంటే వర్త్ ఉన్న డైరెక్టర్ అని నాకు తెలుసు ఆయన స్క్రిప్ట్ పంపినప్పుడు నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాను. ఇంకా స్క్రిప్ట్ చదివే ఓపిక లేక ఓకే చేసేసాను." అని చెప్పింది సంగీత.