English | Telugu
రణవీర్ పై శ్రీముఖి హాట్ కామెంట్స్!
Updated : Sep 13, 2022
తెలుగులో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. వరుసగా షోస్ తో ఈవెంట్స్ తో దేశ విదేశాలు తిరుగుతోంది ఈ రాములమ్మ. ఇక ఇప్పుడు శ్రీముఖి అన్న మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ గా శ్రీముఖి బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో యాంకరింగ్ చేసింది. స్టేజిపై నటుడు ఆలీతో పాటు యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖి రణవీర్ సింగ్ గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.
సైమా అవార్డు ఇచ్చేందుకు స్టేజ్‌పైకి వచ్చిన రణ్‌వీర్ సింగ్ ని శ్రీముఖి తన వద్దకి పిలిచింది. "రణవీర్ ఈ స్టేజి నుంచి వెళ్లిపోయే ముందు అమ్మాయిలంతా జెలస్ ఫీల్ అయ్యేలా ఒక హగ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను" అని అడిగేసరికి రెచ్చిపోయిన రణ్‌వీర్ సింగ్ ఆమెకి హగ్గులిచాడు. అంతటితో ఆగలేదు స్టేజి మీద శ్రీముఖి రెండు చేతుల మీద ముద్దులివ్వడం విశేషం. ఈ ఘటనతో ఉబ్బితబ్బిబ్బయ్యింది శ్రీముఖి. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ఆలీ "దీపికా పదుకొనమ్మా చూస్తున్నావా ఇదంతా ? " అంటూ ఆలీ వేసిన పంచ్ తో అక్కడ ఉన్న అందరిలో నవ్వులు విరిశాయి.
ప్రస్తుతం ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది శ్రీముఖి. ‘‘ ఇది నిజంగానే జరిగిందా ? ఇప్పుడే జరిగింది .. ఐ లవ్ యూ రణ్‌వీర్ సింగ్. ఇలా జరిగేలా చేసినందుకు ఐ లవ్ యూ సైమా అవార్డ్స్’’ అంటూ టాగ్ లైన్ పెట్టేసింది శ్రీముఖి. సౌత్ ఇండియన్ మూవీలకు సంబంధించి అందించే అవార్డు ఫంక్షన్‌లో శ్రీముఖి బ్లాక్ ట్రెండీ వేర్‌లో రచ్చ చేసింది.