English | Telugu

కంటతడి పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ పదో రోజూ 'లై' మూవీలోని 'బొమ్మోలె ఉన్నదిరా పోరీ బంబాటుగా ఉన్నదిరా నారీ' పాటతో మొదలైంది. గీతూ రాత్రి ఎవర్వికి నిదుర లేకుండా చేసిందని రేవంత్, ఆదిత్యతో చెప్పాడు. గీతూతో శ్రీహాన్ కామెడీ చేసాడు.'అయ్యో గీతూ బొమ్మ‌ కూడా వచ్చేసిందే తోడుగా' అని అన్నాడు. దానికి గీతూ నవ్వుతూ ఏం పర్లేదులే ఇదంతా గేమ్ అని వదిలేసింది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ పేరు ‘రింగ్ లోపల ఉన్నోడే కింగ్’. ఈ టాస్క్ లో చివరి వరకూ రింగ్ లో ఉన్నవారే విజేతని, కాగా టాస్క్ లో రేవంత్ సంచాలకుడిగా వ్యవహరిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. కీర్తీభట్, ఆరోహీ, ఫైమా, అర్జున్, ఇనయా మొదటగా టాస్క్ ఆడారు. ఇందులో కీర్తీభట్ అలసిపోయి ఉండగా అదే అదునుగా చూసుకొని ఇనయా రింగ్ బయటకు తోసేసింది. కీర్తిభట్ చాలా కోపంగా ఇనయా ' నేను అలసిపోయి ఉండగా అలా తోసేస్తావా ? ' అని అడిగింది. దానికి సమాధానంగా 'దిజ్ ఈజ్ మై గేమ్, మై స్ట్రాటజీ' అని చెప్పింది. ఐతే తర్వాత కీర్తీభట్ కి మళ్ళీ ఆడే ఛాన్స్ వచ్చినా,తను ఓపికలేక, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడిపోయింది. అది చూసి కంటెస్టెంట్లు అందరూ భయపడ్డారు. వెంటనే కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత గేమ్ లో భాగంగా రేవంత్, చివరి వరకూ రింగ్ లో ఉన్న ఇనయాని విజేతగా ప్రకటించాడు.

బెడ్ రూంలోకి వెళ్ళి ఫైమా ఏడుస్తూ కూర్చుంది. అటుగా వెళ్ళిన కీర్తిభట్ చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే 'నాకు బొమ్మ లేదు, నన్ను ఆడకుండా చేసారు. ఇప్పుడు ఈ ఆటలో కావాలని కూర్చోకూడదన్నాడు, ఇలా రేవంత్ నన్ను గేమ్ ఆడకుండా చేసాడు' అని చెప్పుకుంటూ ఏడ్చేసింది. మరో వైపు వాసంతితో ' నేనెప్పుడూ చూసినా మేకప్ వేసుకుంటానంట అర్జున్ అన్నాడు, అప్పటినుండి నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. రాత్రంతా నిద్ర కూడా పోలేదు' అని చెప్పుకుంటూ వాసంతి ఏడ్చేసింది.

'రండే అర్జున్ ని పంపిద్దాం' అని ఆ రోజు నువ్వు అన్నావ్. అసలు ఆడవాళ్ళను అలా అనొచ్చా, ఎందుకు అలా అన్నావ్. అలా నువ్వు అనడం నాకు నచ్చలేదు . ఆరోహీ, రేవంత్ తో చెప్పగా అలా అనలేదని రేవంత్ అన్నాడు. తర్వాత మధ్యాహ్నం సమయంలో చంటి, రేవంత్ పడుకున్నారు. హౌస్ లో గట్టిగా హారన్ లు మ్రోగాయి. ఆ శబ్దాలకు కెప్టెన్ గా ఉన్న ఆదిత్య వచ్చేసాడు. 'పడుకున్నారా' అని రేవంత్, చంటిని అడిగి, పడుకోకూడదని చెప్పాడు. తర్వాత అక్కడే ఉన్న అర్జున్ శ్రీసత్యతో "పడుకున్నప్పుడు చెప్పాలి కదా, ఏం పీకుతున్నారు మీరు " అని ఆదిత్య అరిచేసాడు. తర్వాత 'ఐస్క్రీం స్కూప్ టైం' గేమ్. ఇనయ సంచాలకురాలిగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు.

రాజ్, షానీ, మెరీనా-రోహిత్ లు పాల్గొన్నారు. ఫస్ట్ రౌండ్ లో రాజ్ గెలిచాడు. రెండో రౌండ్ లో సూర్య, రోహిత్, షానీ ఆడగా మొదటగా సూర్య ఐస్క్రీం స్కూప్ చేయడం వల్ల గెలిచాడు. 'ఇంతటితో సిసింద్రీ టాస్క్ ఐపోయింది, మీ దగ్గర ఉన్న బేబీలకు తగిన విధంగా వీడ్కోలు చెప్పి స్టోర్ రూంలో పెట్టండి' అని బిగ్ బాస్ చెప్పాడు. బేబీలను స్టోర్ రూం లో పెట్టేముందు ఆరోహీ, కీర్తిభట్ ఏడ్చేసారు. రేవంత్ దగ్గరికి వెళ్ళి 'డిసెంబరులో మంచి పాప పుట్టాలని ఆశీర్వదిస్తున్నా' అని చెప్పేసి వెళ్ళిపోయాడు చంటి. ఈ వారం గీతూ,ఫైమా, ఆరోహీ, అభినయశ్రీ, షానీ, మెరీనా-రోహిత్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారని బిగ్ బాస్ ప్రకటించాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.