English | Telugu

ఛాలెంజింగ్ రోల్స్ చేసే సమంత అంటే నాకు ఇష్టం

బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకు ఆయన ఎదిగిన విధానం అందరికీ తెలుసు. రైటర్, యాంకర్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి ఆయనలో. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి వెళ్లకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. తనకు ఎప్పుడూ ప్యాషనేట్ గా ఉండడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం తన టార్గెట్ అన్నారు.తనకు పర్సనల్ గా ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు , మురళీశర్మ ఇష్టమని చెప్పారు. ఎందుకంటే వాళ్లు ఎంచుకునే పాత్రలు కొత్తగా ఉంటాయన్నారు. ఇప్పటికీ వాళ్ళ పాత్రల గురించే మాట్లాడుకుంటారు ఎవరైనా. ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ హిందీలో నవజుద్దీన్ సిద్ధిఖీ, నసీరుద్దీన్ షా కూడా ఇష్టమని చెప్పారు.

అమితాబ్, కమల్ హీరోలుగా కంటే యాక్టర్లుగా చాలా ఇష్టమట. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి ఇష్టమని , తర్వాత అల్లు అర్జున్ అంటే అభిమానమని చెప్పారు. ఎందుకంటే బన్నీ స్టైల్, హార్డ్ వర్క్ చేసే విధానం నచ్చుతుందట తనకు . హీరోయిన్లలో సమంత అంటే చాలా ఇష్టమని బాలాదిత్య చెప్పుకొచ్చారు. సమంత ఎంచుకునే సినిమాలు ఫామిలీ మాన్, సూపర్ డీలక్స్ వంటివి చాలా బాగున్నాయని అవన్నీ ఛాలెంజింగ్ రోల్స్ అని అన్నారు. సమంత యాక్ట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. ఈటీవీలో అప్పట్లో వచ్చే ఛాంపియన్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు అలాంటి షో ఒక్కటి చేస్తే చాలు అనుకున్న టైంలో సంకల్ప బలం గట్టిగా ఉందేమో అనుకోకుండా ఆ షో కి హోస్ట్ గా చేసే ఛాన్స్ తనకు వచ్చేసరికి ఎంతో సంతోషపడ్డాను అన్నాడు బాలాదిత్య. ఇక ఇప్పుడు బాలాదిత్య బిగ్ బాస్ షో ద్వారా హౌస్ లో అందరికీ ఆత్మీయుడు ఐపోయాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.