English | Telugu

ఎనిమిదో రోజు నామినేషన్లో ఉందెవరు..?

బిగ్ బాస్ ఎనిమిదో రోజు 'బాక్స్ బద్దలైపోయే' సాంగ్ తో మొదలైంది. బిగ్ బాస్, కంటెస్టెంట్లతో మాట్లాడుతూ "ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా కీలకమైంది, ప్రతీ ఒక్కరికి ఒక్క ఓట్ మాత్రమే లభిస్తుంది. ఎవరిని బయటికి పంపిస్తే బిగ్ బాస్ ఇంటికి మంచిది అనిపిస్తుందో వారినే నామినేట్ చేయండని" బిగ్ బాస్ చెప్పాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఉన్న కుండను బావిలో పడేసి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణం చెప్పండని, కెప్టెన్‌గా ఉన్న ఆదిత్య ఈ నామినేషన్ నుండి తప్పుకుంటున్నాడని, ఆరోహీ నామినేషన్ ను మొదలుపెట్టమని బిగ్ బాస్ చెప్పాడు.

ఆరోహీ, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. నువ్వు మాట్లాడే విధానం బాలేదని చెప్పి వెళ్ళిపోయింది. శ్రీహాన్ , గీతూని నామినేట్ చేసాడు. 'నువ్వు మగవాళ్ళకు బుద్ధి లేదు అని అన్నావ్ ', అది నాకు నచ్చలేదని చెప్పి శ్రీహాన్ వెళ్ళిపోయాడు. ఫైమా, రేవంత్ ను నామినేట్ చేసింది. నిన్ను నామినేట్ చేయడానికి కారణం సండే ఫండే రోజూ అందరి మీద సీరియస్ అయ్యావు. అది నాకు నచ్చలేదని చెప్పింది.

ఆదిరెడ్డి నామినేషన్ మొదలుపెట్టే ముందు ఆరోహీతో మాట్లాడాడు. నీతో రాపో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలా, టాస్క్ లో బాగా ఫర్మామెన్స్ చేసినవాళ్ళు ఉండాలా అని అడిగాడు. దానికి ఆరోహీ 'టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేసినవాళ్ళు ఉండాలి' అని చెప్పింది. నువ్వు సరిగ్గా ఆడకపోయినా అందరూ ఆడలేదు మరి అలా ఎలా అంటున్నావ్ అని, తర్వాత మెరీనా-రోహిత్ ఇద్దరిని కలిపి నామినేట్ చేసాడు.ఆ తర్వాత చంటి, గీతూని నామినేట్ చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసారు.

ఎనిమిదవ రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి,రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.