English | Telugu

ఎప్పుడూ చూసే ఫేస్ కదా కొత్తగా ఏముంది!

బుల్లి తెర మీద ఇప్పుడు ఆలీ తన షోతో ఫేమస్ అయ్యాడు, మనో సింగింగ్ షోస్ కి జడ్జి హోదాలో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు, బాబా మాస్టర్ డాన్సింగ్ షోస్ కి జడ్జి గా అలరిస్తున్నాడు. బుల్లి తెర మీద వీళ్ళ హవా కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్య. ఐతే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పార్టనర్స్ ని తీసుకొచ్చారు.

జీ తెలుగు కొత్త కొత్త ఈవెంట్స్ కి, సీరియల్స్ కి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు "లేడీస్ అండ్ జెంటిల్ మాన్" పేరుతో ఒక ఫన్నీ ప్రోగ్రాం తీసుకురాబోతోంది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 18 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ ఈవెంట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పైన చెప్పిన ముగ్గురు వాళ్ళ వాళ్ళ భార్యలను ఈ షోకి తీసుకొచ్చారు. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ చేస్తున్నాడు. స్టేజి మీదకు వచ్చిన ఆలీ వైఫ్ "తనకు అస్సలు టైం ఇవ్వడం లేదు అని ఆలీ మీద కంప్లైంట్ చేసేసరికి..రోజూ చూసే ఫేస్ కదా అంటూ నాలుక్కర్చుకున్నాడు.

"ఇక మనో గారిని "ఇంటికెళ్ళారు సర్ తర్వాత పరిస్థితి ఏమిటి" అని ప్రదీప్ అడిగేసరికి "అపురూపమైనదమ్మా ఆడజన్మ" అంటూ సాంగ్ వేసుకుంటాను అన్నారు మనో. ఫైనల్ గా "ఎన్ని ఇయర్స్ అయ్యింది సర్ మ్యారేజ్ అయ్యి" అని బాబా భాస్కర్ మాస్టర్ ని అడిగాడు ప్రదీప్ "19 ఇయర్స్ రన్నింగ్ అంటాడు బాబా. డేట్ ఏమన్నా ఐడియా ఉందా అని మళ్ళీ అడిగేసరికి యో..ఏంటయ్యా నువ్వు..గొడవలు పెట్టేలా ఉన్నావే" అన్నట్టుగా చూస్తాడు బాబా. ఇలా ఈ షోలో వీళ్ళ ముగ్గురు ఫామిలీస్ తో వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.