English | Telugu
మేకప్ లేని రష్మిని చూసి షాకైన రోహిణి!
Updated : Sep 15, 2022
మేకప్ తో ఉంటేనే సెలబ్రిటీస్ ని చూడగలుగుతాం. ఒకవేళ మేకప్ లేదు అంటేవాళ్ళను గుర్తుపట్టడం కష్టం.'ఏమిటి ఇలా ఉన్నారు'.. అని అనుకోకుండా మాత్రం ఉండం. ఇప్పుడు రోహిణి కూడా రష్మీని చూసి అలాగే భయపడింది. కొత్తగా ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఈ స్కిట్ రాబోతోంది. హాట్ యాంకర్ గా, గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రష్మీ.. రోహిణి మాటలకు షాకైపోయింది.
ఈ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో రోహిణి, వర్షతో పాటు ఇమ్మాన్యుయెల్ కూడాకనిపించాడు. భాస్కర్ వాళ్ళ అమ్మగా కమెడియన్ రోహిణి నటించింది."అమెరికా వెళ్దావమ్మా" అని అడిగేసరికి, రోహిణి " నేను హైదరాబాద్ చూశాకే అమెరికా వస్తాను" అంటూ పంతం పట్టుకుని కూర్చొంటుంది. దీంతో భాస్కర్ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి, అక్కడ జబర్దస్త్ సెట్ ని చూపించడానికి తీసుకెళ్లారు.
అసిస్టెంట్‌గా ఉన్న ఇమ్మాన్యుయెల్ జబర్దస్త్ సెట్‌ని చూపించి, "అదిగో యాంకర్ రష్మీ, రష్మీ"అంటూ భాస్కర్ వాళ్లమ్మకి చూపించి ఆమె దగ్గరకు తీసుకెళ్లారు. రోహిణి చాలా ఎగ్జైట్‌మెంట్ తో రష్మి దగ్గరికెళ్లి "వాయమ్మో" అంటూ షాక్‌లోకి వెళ్ళిపోయింది. సృహ కోల్పోయినంత పని చేసి స్టేజి మీద అలాగే పిచ్చిదానిలా కూర్చుండిపోయింది. ఇది చూసిన ఇమ్మాన్యుయెల్, "నీకు ముందే చెప్పాను, మీ అమ్మకు హార్ట్ ఎటాక్ పెట్టుకుని భయంకరమైనవి చూపించకూడదు" అని రష్మిపై పంచ్‌లు వేశాడు. దీనికి రష్మి కొంటెగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ స్కిట్ ఆద్యంతం కామెడీని పంచింది.