English | Telugu

ఇక కుటుంబ కథా చిత్రాలకి మంగళం పాడినట్లేనా!

సినిమా అనే అందమైన ప్రపంచాన్నిప్రేక్షకులకి దగ్గరగా చేసిన చిత్రాలు ఏవి అంటే కుటుంబ కథా చిత్రాలు అని చెప్పవచ్చు. ఒక రకంగా సినిమా పుట్టుక కూడా కుటుంబ కథా చిత్రాలతోనే ప్రారంభమైంది. ఇందుకు తెలుగు సినిమా మినహాయింపు కాదు. తెలుగు సినిమా(Telugu cinema)ప్రారంభం నుండి కుటుంబ కథా చిత్రాలే రాజ్యమేలాయి. ఆ తర్వాత నూతన ఒరవడులతో అనేక జోనర్స్ వచ్చాయి. కానీ  కుటుంబ కథా చిత్రాల రాక మాత్రం ఆగలేదు. అగ్ర హీరోలు సైతం ఎన్ని కమర్షియల్ చిత్రాలు చేసినా, ఫ్యామిలీ చిత్రాలని మాత్రం వదల్లేదు. ఒక రకంగా ఆ చిత్రాలు ఎంత పెద్ద హీరో అయినా,తన సినీ జర్నీకి శ్రీరామరక్ష గా ఉండేవి. అంతటి శక్తి కుటుంబ కథా చిత్రాల సొంతం.