English | Telugu
నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది
Updated : Nov 12, 2025
-భాగ్యశ్రీ బోర్సే ఏం చెప్పింది!
-కాంత గురించి ఏమంటుంది
-ఖుష్బూ చెప్పిన విషయాలు ఏంటి!
అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన నటీమణులు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఎంతో రేర్ గా తళుక్కుమంటారు. అభిమానులు ప్రేక్షకులు కూడా సదరు నటీమణులని దేవకన్యల్లాగా భావిస్తారు. అలాంటి ఒక దేవకన్యే 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse). అందుకే మొదటి చిత్రం మిస్టర్ బచ్చన్ పరాజయం పాలైనా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 14 న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)తో కలిసి చేసిన 'కాంత' తో తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకులని పలకరించనుంది.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతు 'కాంత'(Kaantha)తోనే నేను దక్షిణాదికి పరిచయం కావాల్సింది. నేను విన్న మొట్టమొదటి సబ్జెక్టు కూడా ఇదే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. 1950 ,60 వ కాలం నేపథ్యంలో జరిగే కథలో నా క్యారక్టర్ పేరు కుమారి. సదరు క్యారక్టర్ చెయ్యడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలనాటి హీరోయిన్స్ లాగా కళ్ళతోనే భావాలు పలికించాలి. ఇందుకోసం సావిత్రి, శ్రీదేవి గారి సినిమాలు చూడటంతో పాటు కొంత మంది మనుషులని కూడా కలిసాను. ఇప్పుడు పలికే సంబాషణలకి, నాటి తరం సంబాషణలకి చాలా తేడా ఉంది. అందుకే సంభాషణలు స్పష్టంగా చెప్పడానికే ఆరు నెలల సమయం తీసుకున్నాను.
ఈ మధ్య సీనియర్ నటీమణి ఖుష్బూ గారిని కలిసాను. ఆమె నాతో మాట్లాడుతు సోషల్ మీడియా లేని రోజుల్లో జీవితం ఎంత వైవిధ్యంగా ఉండేదో, ప్రస్తుతం సోషల్ మీడియా మోజులో పడి మనం ఎలాంటి ఆనందమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నామో చెప్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఆ కాలాన్నిస్వర్ణ యుగం అని ఎందుకు కూడా అంటారో కూడా 'కాంత' ద్వారా అర్ధమయింది. నా అంతరాత్మ మాత్రం అప్పటి కాలానికి దగ్గరగానే ఉంటుందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. మహారాష్ట్ర లోని పూణే భాగ్యశ్రీ స్వస్థలం కాగా 'రామ్ పోతినేని'(Ram Pothineni)తో చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో ఈ నెల 28 న మరో మారు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.