English | Telugu

ఆగిపోయిన ఎన్టీఆర్ సినిమా మళ్ళీ పట్టాలెక్కుతుందా?

బాలీవుడ్ తలపెట్టిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే అది ఆగిపోవడం వల్ల.. గతంలో ఆగిపోయిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రాజెక్ట్ లో కదలిక వచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది.

ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్ లో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ని నిలిపి వేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఓ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రకటన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని న్యూస్ వినిపించింది.

Also Read:స్పిరిట్ లో చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి!

అయితే ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం, మరోవైపు ఫాల్కే బయోపిక్ కోసం ఆమిర్ ఖాన్-హిరానీ వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడంతో.. 'మేడ్ ఇన్ ఇండియా' హోల్డ్ లో పడింది.

ఇప్పుడు అనూహ్యంగా ఆమిర్ ఖాన్-హిరానీ తలపెట్టిన ఫాల్కే బయోపిక్ ఆగిపోయిందని వార్తలు వస్తుండటంతో.. మళ్ళీ 'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్ లో కదిలిక వచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ గొప్ప నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటిస్తే.. నటుడిగా మరింత ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.