మీరు సిద్ధమంటే నేను సిద్ధమే.. ఎన్టీఆర్ పోస్టర్ వైరల్
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నటనకి ఉన్నశక్తిని మరోమారు చాటి చెప్పిన చిత్రం 'దేవర'(Devara).గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యింది. దేవర, వర గా రెండు విభిన్నమైన క్యారక్టర్ లలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు,ప్రేక్షకులు దేవర కి జేజేలు పలికారు. భయస్థుడైన వర, చనిపోయిన తన తండ్రి దేవర ఉన్నాడని నమ్మించి,శత్రువులలో భయాన్ని అలాగే ఉంచుతాడు. పైగా దేవర గుండెల్లో కత్తి ఉన్నప్పుడు,వర నే ఆ కత్తి దించినట్టుగా చూపించారు. అసలు దేవర బాడీ కూడా దొరకదు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 లో కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది.