English | Telugu
నాగార్జున పై అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్
Updated : Nov 11, 2025
-నాగార్జున పై కొండ సురేఖ సంచలన ట్వీట్
-అభిమానుల ఆగ్రహం
-క్షమాపణలు చెప్పిన సురేఖ
-నాగార్జున నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఏడున్నర దశాబ్దాల సినీ జీవితం లెజండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు(ANR)సొంతం. అంటే తెలుగు సినిమా కూడా ఆ మహానటుడు తో ప్రయాణాన్ని మొదలు పెట్టిందని చెప్పవచ్చు. అయన వారసుడుగా కింగ్ నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటు ఒక ఎరా ని సృష్టించుకొని లక్షలాది మంది అభిమానులని సంపాదించాడు. స్టూడియో అధినేతగా కూడా తెలుగు చిత్ర పరిశమ్రకి ఎన్నో సేవలందిస్తూ వస్తున్నాడు. కొన్నినెలల క్రితం నాగార్జున(Nagarjuna)ఆయన మాజీ కోడలు సమంత(Samantha)ని ఉద్దేశిస్తు తెలంగాణ రాష్ట్రమంత్రి కొండా సురేఖ'(KOnda Surekha) వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం సృష్టించడంతో పాటు అక్కినేని అభిమానుల్లో ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి .
రీసెంట్ గా కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం నాకు ఎక్కడ లేదు. నా వ్యాఖ్యల వల్ల నాగార్జున ఫ్యామిలీ బాధపడి ఉంటే, అందుకు చింతిస్తూ నా వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన ఈ క్షమాపణ పోస్ట్ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే.
aslo read: ది గర్ల్ ఫ్రెండ్ నాలుగు రోజుల కలెక్షన్స్! పెరిగాయా, తగ్గాయా!
ఈ కేసుని సంబంధించి ఇప్పటికే కొన్నిసార్లు నాగార్జున అండ్ ఫ్యామిలీ కోర్టు కి హాజరయ్యింది. మరి ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.