స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన భామ రొమాన్స్!
'ఉప్పెన' తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ 'కృతిశెట్టి'(Krithi Shetty).మొదటి చిత్రమే అయినా, ఎంతో బరువుతో కూడిన క్యారక్టర్ లో పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. ఆ తర్వాత చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా హిట్ కావడంతో, కృతి శెట్టి నెంబర్ వన్ హీరోయిన్ గా నిలబడుతుందని అనుకున్నారు. కానీ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ, ఇలా వరుసగా ఐదు సినిమాలు ప్లాప్ గా నిలవడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో ప్రదీప్ రంగనాధన్ తో కలిసి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే మూవీ చేస్తుండగా, ఈ నెల 17 న విడుదల కానుంది.