English | Telugu

ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మోగ్లీ' టీజర్.. మోడ్రన్ రామాయణం!

నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ 'కలర్ ఫోటో'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్.. ఐదేళ్ళ తర్వాత డైరెక్టర్ గా రెండో సినిమా 'మోగ్లీ'తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కార్, బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. (Mowgli Teaser)

దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన 'మోగ్లీ' టీజర్ బాగానే ఉంది. స్టోరీ రెగ్యులర్ గా ఉన్నప్పటికీ.. సెటప్, రామాయణం రిఫరెన్స్ కాస్త కొత్తదనం తీసుకొచ్చాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటోంది. వినలేని, మాట్లాడలేని అమ్మాయి ప్రేమలో హీరో పడతాడు.

హీరో హీరోయిన్ పాత్రలను రాముడు సీతతో పోల్చారు. వారి కథలోకి రావణుడి లాంటి పోలీస్ పాత్రధారి బండి సరోజ్ కుమార్ వచ్చినట్టుగా టీజర్ ను రూపొందించారు. నటీనటుల పర్ఫామెన్స్ లు, కాలభైరవ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. మరి ఈ మోడ్రన్ రామాయణం ఎలా ఉంది? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.