English | Telugu

ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసుండరు!

ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. ఇటీవల కాలంలో విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 21న '12A రైల్వే కాలనీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. (12A Railway Colony)

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'12A రైల్వే కాలనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక హత్య కేసు విచారణ నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు ఈ కేసుతో అల్లరి నరేష్ కి సంబంధం ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అనే క్యూరియాసిటీని కలిగిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.

Also Read:అఖండ-2.. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా తాండవం!

ముఖ్యంగా "బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసుండరు" అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ తో.. ఈ సినిమాలోని మర్డర్ మిస్టరీ ఎంత కొత్తగా ఉండబోతుందో అర్థమవుతోంది.

ఊహించని మలుపులు, కట్టిపడేసే ఎమోషన్స్ తో '12A రైల్వే కాలనీ' మూవీ ఎంగేజింగ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. పొలిమేర తరహాలోనే క్షుద్ర పూజల ప్రస్తావన ఉంటుందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.

చూద్దాం మరి '12A రైల్వే కాలనీ'తో అల్లరి నరేష్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో.