చాలా థాంక్స్.. ఇక నుంచి సినిమా వాళ్ళు వాటికి ప్రమోషన్ చెయ్యరు
తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పైరసీ ముఠాని రీసెంట్ గా హైదరాబాద్(Hyderabad Police)పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చెయ్యడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలని స్వాధీనం చేసుకున్నారు.