ప్రభాస్తో నా ఫస్ట్ సీన్ అదే..దాని గురించి ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు...
శ్రీదేవి విజయకుమార్ తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. తెలుగులో రుక్మిణి, ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆదిలక్ష్మి, వీర వంటి మూవీస్ లో నటించింది. రీసెంట్ గా సుందరకాండ మూవీలో నటించింది. ఇక ఈశ్వర్ మూవీలో ఫస్ట్ సీన్ గురించి ఇలా చెప్పింది ఒక చిట్ చాట్ షోలో..."ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ గారితో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి" అన్న ప్రశ్నకు శ్రీదేవి నవ్వుతూ "ఈ ప్రశ్నను ఇంతవరకు ఎవరూ అడగలేదు. ఫస్ట్ టైం మీరు అడిగారు" అంటూ తన ఫస్ట్ సీన్ గురించి చెప్పింది...