English | Telugu

అలా చేస్తే ఈవెంట్‌ క్యాన్సిల్‌ అవుతుంది.. కాబట్టి ఇలా చేయండి!

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీకి సంబంధించిన ‘గ్లోబ్‌ ట్రోటర్‌’ ఈవెంట్‌ నవంబర్‌ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా జరగనుంది. ఇటీవలికాలంలో కొన్ని పబ్లిక్‌ సినిమా ఫంక్షన్స్‌లో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ శాఖ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని నిబంధనలు విధించింది. వాటిని వివరిస్తూ.. దర్శకుడు రాజమౌళి ఒక వీడియో విడుదల చేశారు.

‘మన ‘గ్లోబ్‌ ట్రోటర్‌’ ఈవెంట్‌ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మన ఈవెంట్‌ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం. దీనికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ శాఖ కొన్ని కఠిన నింబంధనలు విధించారు. అవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. ఇది ఓపెన్‌ ఈవెంట్‌ కాదు. ఫిజికల్‌ పాసెస్‌ ఉన్నవాళ్ళు మాత్రమే ఈవెంట్‌కి రావాలి. అలాగే నేను కొన్ని వీడియోస్‌ చూశాను. ఇది ఓపెన్‌ ఈవెంట్‌ అనీ, ఎవరు పడితే వాళ్ళు రావొచ్చని చెబుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో పాసులు అమ్ముతున్నారని కొందరు చెబుతున్నారు. అదంతా నమ్మొద్దు. ఫిజికల్‌ పాస్‌ ఉన్నవారిని తప్ప మరెవరినీ అనుమతించే ప్రసక్తే లేదు

18 సంవత్సరాల లోపు వయసు వారిని, వృద్ధులను పోలీసులు అనుమతించడం లేదు. అందువల్ల అలాంటి వారు ఈవెంట్‌కి రాకుండా ఇంట్లోనే ఉండి జియో హాట్‌స్టార్‌లో లైవ్‌ చూస్తే బెటర్‌. పోలీసుల నిబంధనలను పరిగణణలోకి తీసుకుని ఈవెంట్‌ని చాలా స్ట్రిక్ట్‌గా నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఈవెంట్‌ని అక్కడికక్కడే క్యాన్సిల్‌ చేయిస్తామని పోలీస్‌ కమిషనర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అందువల్ల అందరూ ఎవరికి వారు వారి సేఫ్టీ గురించి జాగ్రత్తలు తీసుకుని ‘గ్లోబ్‌ ట్రోటర్‌’ ఈవెంట్‌ని జయప్రదం చేయాలని కోరుతున్నాను’ అన్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.