English | Telugu

‘కాంత’ వివాదం.. అందరి నోట ఒకటే మాట!

- కోర్టుకెక్కిన త్యాగరాజ భాగవతార్ మనవడు

- కాంత వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

- కాంతపై సోషల్ మీడియాలో పోస్టులు

దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్‌ మీడియా బేనర్స్‌పై దుల్కర్‌ సల్మాన్‌, రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘కాంత’ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ ఓ వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవిత కథనే ‘కాంత’ చిత్రంగా మలిచారంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో త్యాగరాజ భాగవతార్‌ మనవడు ‘కాంత’ చిత్ర నిర్మాతలపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

నవంబర్‌ 14న ఈ సినిమా విడుదలవుతుండగా త్యాగరాజ భాగవతార్‌ మనవడు కోర్టుకెక్కడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇటీవల చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ బ్రిలియన్స్‌ విషయంలో పడిన గొడవల నేపథ్యంలోనే ఈ కథ ఉంటుంది తప్ప ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు అన్నారు. మరోపక్క ఈ సినిమా ప్రీమియర్స్‌ ఆల్రెడీ వేశారు. మీడియాకి కూడా సినిమాని చూపించారు. ‘కాంత’లో వివాదాస్పద అంశాలు ఏమీ లేవని సినిమా చూసిన వారు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. త్యాగరాజ భాగవతార్‌ జీవితానికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి జరిగిన ప్రచారం అర్థం లేనిదని తేల్చారు. దీంతో ‘కాంత’ వివాదానికి తెరపడినట్టుగానే భావించాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.