English | Telugu
'కాంత'పై కోర్టులో కేసు వేసిన ప్రముఖ హీరో మనవడు.. 14న రిలీజ్ ఉందా!
Updated : Nov 12, 2025
చిక్కుల్లో కాంత
త్యాగరాజ భాగవతార్ మనవడు పిటిషన్
14న రిలీజ్ అవుతుందా?
బాక్స్ ఆఫీస్ ని తన వశం చేసుకోవడానికి ఈ నెల 14న రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ 'కాంత'(Kaantha). మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సమానమైన క్రేజ్ ని సంపాదించిన 'దుల్కర్ సల్మాన్'(Dulquer Salmaan) హీరో కాగా, మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్. రానా దగ్గుబాటి(Rana Daggubati)తో కలిసి దుల్కర్ సల్మాన్ 'కాంత' ని తమిళంలో డైరెక్ట్ సినిమాగా నిర్మించడం కాంత స్పెషాలిటీ. అందుకు కారణం కూడా లేకపోలేదు. కాంత చిత్రం మొట్టమొదటి తమిళ హీరో 'ఏంకే త్యాగరాజ భాగవతార్'(Mk Thyagaraja Bhagavathar) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ప్రచార చిత్రాలతో పాటు ట్రైలర్ ద్వారా ఈ విషయం స్పషంగా అర్ధమవుతుంది.
రీసెంట్ గా చెన్నై కోర్టులో త్యాగరాజ భాగవతార్ మనవడు ఒక పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో కాంత మూవీలో తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే విషయాన్నీ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం సౌత్ సినీ పరిశమ్రలో సంచలనంగా మారడంతో పాటు కోర్టు తీర్పు ఎలా వస్తుందనే టెన్షన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఉంది. కాంత కథ మెయిన్ పాయింట్ ని ఒకసారి చూసుకుంటే దర్శకుడు, స్టార్ హీరో మధ్య తలెత్తిన విభేదాలతో తెరకెక్కింది. ఆ విబేధాలకి కారణం ఇగో, ఆర్ట్, గౌరవం.
Also Read:హరిహర వీరమల్లు ఆర్ట్ డైరెక్టర్ కి ఫ్రాన్స్ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏంకే త్యాగరాజ భాగవతార్ సినీ జీవితాన్ని ఒకసారి చూసుకుంటే భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్ నే. పూర్తి పేరు 'మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్ విశ్వకర్మ'. శాస్త్రీయ సంగీత గాయకుడిగా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత నాటకాలు, సినిమాల ద్వారా అపార ఖ్యాతిని సంపాదించాడు. 1934లో వచ్చిన ‘పావలక్కోడి’ ఆయన తొలి సినిమా. సుమారు పద్నాలుగు సినిమాలు చేసిన తర్వాత నిర్మాత శ్రీరాములు నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ హత్య కేసులో భాగవతార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు.
బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు తిరిగి ఆయన్నిహీరోగా స్వీకరించలేదు. నవంబర్ 1, 1959లో 49 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. కాకపోతే 1944లో వచ్చిన ‘హరిదాస్’ చిత్రం మద్రాస్ బ్రాడ్‌వే థియేటర్‌లో మూడు సంవత్సరాలపాటు నిరంతర ప్రదర్శన పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంత సినిమాలో ఏ ఏ అంశాలని పొందుపరిచారనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. రానా దగ్గుబాటి, సముద్ర ఖని కూడా కీలక పాత్రల్లో తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనున్నారు.