English | Telugu
పెద్ది లో చిరంజీవి సీనియర్ హీరోయిన్!.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సలహా
Updated : Nov 11, 2025
-పెద్ది లో చిరంజీవి భామ
-ఎవరో తెలుసా!
-అభిమానుల హంగామా షురూ
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)వన్ మాన్ షో ' పెద్ది'(Peddi)వచ్చే ఏడాది మార్చి 26 న థియేటర్స్ లో ల్యాండ్ అవ్వనుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన 'చికిరి'(Chikiri) సాంగ్ తో ఇప్పటినుంచే పెద్ది సందడి వాతావరణం అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో నెలకొని ఉంది. కాస్టింగ్ పరంగా కూడా అభిమానులకి మరింత కనువిందు కలిగించనుంది. అందుకు తగ్గట్టే కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' (shiva rajkumar)గౌర్ నాయుడుగా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జగపతి బాబు, దివ్యేన్ధు శర్మ వంటి ప్రతిభావంతమైన నటులు కూడా ప్రాముఖ్యత గల క్యారక్టర్ లలో కనిపిస్తున్నారు.
ఇప్పుడు మాజీ హీరోయిన్ 'శోభన'(Shobana)పెద్దిలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించకపోయినా శోభన 'కీ' రోల్ లో చెయ్యడం పక్కా అనే న్యూస్ ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో మెగా అభిమానులు కూడా శోభన గారు చరణ్ సినిమాలో చేస్తే చూడాలని ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అలా కోరుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. చిరంజీవి(Chiranjeevi)సరసన శోభన రుద్రవీణ, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో నటించి చిరు కి మరో హిట్ ఫెయిర్ గా నిలిచింది. పైగా ఆ రెండు చిత్రాలు మెగా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రుద్రవీణ జాతీయ అవార్డు గెలుచుకుంటే రౌడీ అల్లుడు నేటికీ ట్రెండ్ సెట్టర్ గా ఉంది. యూట్యూబ్ లో రౌడీ అల్లుడు కి వస్తున్న వ్యూస్ నే అందుకు ఉదాహరణ. దీంతో శోభన ని ఇప్పుడు చరణ్ సినిమాలో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
also read : కుప్పకూలిపోయిన హీరో గోవిందా.. ప్రస్తుత పరిస్థితి ఇదే
మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన శోభన తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జత కట్టి, తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ అని కూడా అనిపించుకుంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తు ఈ ఏడాది ఏప్రిల్ లో 'మోహన్ లాల్'(Mohanlal)తో కలిసి 'తుడురమ్'(Thuduram)అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోగా మోహన్ లాల్ భార్యగా లలిత షణ్ముగం అనే క్యారక్టర్ లో శోభన ప్రదర్శించిన నటన అనిర్వచనీయం. మరి 'పెద్ది' లో ఎలాంటి క్యారక్టర్ ని పోషిస్తుందో చూడాలి.