English | Telugu
పెళ్ళి తర్వాత మొదటిసారి వచ్చిన గౌతమ్, నందు!
Updated : Aug 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -225 లో.. భవాని సిద్ధాంతి గారు రాగానే.. రేవతిని తప్ప మిగత అందరూ ఇక్కడ నుండి వెళ్ళండని చెప్తుంది. కృష్ణ, మురారి గురించి సిద్ధాంతికి భవాని చెప్తుంది. అలా మంగళ సూత్రం తెగిపోయింది, దీని వళ్ళ ఏమైనా జరుగుతుందా అని అడుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమని భవాని చెప్తుంది. అలా జరగడం అనుకోకుండా జరిగింది. అంతే గాని దానివల్ల ఎవరికేం కాదని సిద్ధాంతి చెప్తాడు. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలంటే మీరు రేపు పూజ జరిపించాలని సిధ్ధాంతి చెప్తాడు.
ఆ తర్వాత రేపు వాళ్ళ ఇద్దరికి మళ్లీ మాంగల్యధారణ జరిపించాలని సిద్ధాంతి చెప్తాడు. దానికి భవాని సరేనని సంతోషపడుతుంది. రేవతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళని ఎవరు విడదీయ్యలేరని అనుకుంటుంది.. ముకుంద మాత్రం మళ్ళీ మాంగల్యధారణేంటి? మళ్ళీ ఇద్దరు కలిసిపోతారా అని టెన్షన్ పడుతుంది. సిద్ధాంతి వెళ్ళిపోయాక భవాని పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని రేవతి, ప్రసాద్ లకి చెప్తుంది. మరొకవైపు మేం సంతోషంగా ఉండాలని భవాని అత్తయ్య ఇలా చేస్తున్నారు.. మా మధ్య ప్రేమ లేదని తెలిస్తే ఎలా ఉంటుందోనని కృష్ణ బాధపడుతుంది. ఇన్ని రోజులు పెద్దత్తయ్య దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టేయలని ట్రై చేశాను, ఏకంగా ఇప్పుడు పెద్దత్తయ్య మనసులో స్థానం సంపాదించాను. ఇక నాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే కోపంతో పాటు బాధపడుతారని కృష్ణ అనుకుంటుంది. మరొకవైపు ఇంటికి ఎవరో వస్తున్నారని భవాని హడావిడి చేస్తుంది. అది చూసిన ప్రసాద్.. ఎవరు వస్తున్నారని భవానిని అడుగుతాడు. వస్తారుగా నువ్వే చూడని భవాని అంటుంది.
ఆ తర్వాత మొదటిసారిగా నందు, గౌతమ్ ఇద్దరు భవాని ఇంటికి వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకోమని మురారిని పంపిస్తుంది భవాని. కృష్ణ నువ్వు హారతి తీసుకొని రా అని భవాని చెప్తుంది. ఆ తర్వాత నందు, గౌతమ్ లను గుమ్మం దగ్గర నిలుచోపెట్టి హారతి ఇస్తుంది కృష్ణ. ఇక మధు వాళ్ళని ఒకరి పేర్లు ఒకరు చెప్పండని సరదాగా అటపట్టిస్తాడు. వాళ్ళు ఇంట్లోకి రాగానే నందుని చూసి భవాని సంతోషపడుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. కృష్ణ మురారి ఏంటి డల్ గా ఉన్నారని నందు అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీలని భవాని పిలిచి.. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని, రేపు పూజకి ఇద్దరు సిద్ధంగా ఉండమని చెప్తుంది. దానికి సరేనని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.