English | Telugu

ప్రెగ్నెంట్ గా ఉన్న స్వప్నకి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకని రుద్రాణి అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నటి ఎపిసోడ్ -165 లో.. కళ్యాణ్ కి వచ్చిన కొరియర్ ఇవ్వనని కావ్య కళ్యాణ్ ని ఆటపట్టిస్తుంది. అందరూ ఆ లెటర్ లో ఏం ఉందో చదవమని కావ్యకి చెప్తారు. వద్దు వదిన ప్లీజ్ అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ కి కావ్య ఆ కొరియర్ ఇస్తుంది. కళ్యాణ్ ఆ కొరియర్ తీసుకొని వెళ్లి తన గదిలో కూర్చొని తన అభిమాన పాఠకూరాలు రాసిన లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ రాసింది ఎవరో కళ్యాణ్ కి అర్థం కాదు.

మరొకవైపు స్వప్న కడుపునొప్పితో ఇబ్బంది పడుతుటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే నాకు కడుపు లేదని తెలుస్తుంది. స్వప్న టాబ్లెట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తుంది. మరొకవైపు కనకం అప్పు ఇద్దరు కలిసి చీటి వేసే రంగమ్మ దగ్గరికి వెళ్తారు. చీటీ వేస్తాను ముందు డబ్బులు తీసుకుంటానని కనకం చెప్పగానే.. రంగమ్మ వాళ్ళని అవమానిస్తుంది. మీకు తిండికే గతి లేదు చీటీ డబ్బులు ఎలా ఇస్తావంటూ అవమానిస్తుంది. అప్పుడే రంగమ్మ భర్త వస్తాడు. ఇతనెవరు మొన్న సినిమాకి వెళ్లింది ఎవరితో అని అప్పు అంటుంది. అలా అని రంగమ్మకి వాళ్ళ భర్తకి మధ్య గొడవ పెట్టిస్తుంది అప్పు. మరొకవైపు స్వప్న ఆర్డర్ చేసిన టాబ్లెట్స్ వస్తాయి. కాగా అవి టెన్షన్ పడుతూ వెళ్లి తీసుకుంటుంది. ఏంటవి స్వప్న అంత రహస్యంగా టెన్షన్ పడుతూ తీసుకొని వెళ్తుందని రుద్రాణి చూస్తుంది. స్వప్న లోపలికి వెళ్లి టాబ్లెట్స్ వేసుకొని మిగతావి కబోడ్ లో పెడుతుంది. మరొక వైపు కావ్య డబ్బులు తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒక మాట రాజ్ కి చెప్పాలని మెసేజ్ చేస్తుంది. ఈ డబ్బులు మా నాన్నకి ఇస్తున్న అని రాజ్ కి కావ్య మెసేజ్ చేస్తుంది. నీ డబ్బులు నీకు నచ్చినట్టు వాడుకో.. నాకు ఎందుకు చెప్తున్నావని రాజ్ అంటాడు.

మరొక వైపు స్వప్న రహస్యంగా తీసుకొని వచ్చిందేంటని రుద్రాణి అనుకొని, స్వప్న గదిలోకి వెళ్లి కబోడ్ లో ఉన్న టాబ్లెట్స్ చూసి ఇవి పీరియడ్స్ వస్తే వేసుకునే టాబ్లెట్స్ కదా ఇవి స్వప్నకి ఎందుకు? అంటే స్వప్న ప్రెగ్నెంట్ కాదా అని అనుకొని బయటకు వస్తుంటే.. రాహుల్ ఎదురుపడుతాడు. ట్యాబ్లెట్స్ చూసిన రాహుల్.. ఏంటవని అడుగుతాడు. అప్పుడు రుద్రాణి టాబ్లెట్స్ విషయం చెప్తుంది. అంటే ఆ స్వప్న మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకుందని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. ఏంటి ఈ టాబ్లెట్స్ ఎందుకు? మమ్మల్ని ఎందుకు మోసం చేసావంటూ స్వప్నని నిలదీస్తుంది రుద్రాణి. దాంతో స్వప్న టెన్షన్ పడుతుంది. అప్పుడే కావ్య ఏమైందని అక్కడికి వస్తుంది. చూడే అంతా నీ వల్లే నీకు కడుపు నొప్పి అంటూ టాబ్లెట్స్ ఆర్డర్ చెయ్యమన్నావ్.. ఇప్పుడు వీళ్ళు ఇవి చూసి నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారని స్వప్న అంటుంది. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.