English | Telugu

వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మాత్రమేనని, ప్రేమ లేదని నందుకి చెప్పేసిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నటి ఎపిసోడ్ -226 లో.. నీకు ఒక రిక్వెస్ట్ కృష్ణ అని మురారి అనగానే.. ఏంటని కృష్ణ అడుగుతుంది. ఇలా అందరిలో ఉన్నప్పుడు నీలా నువ్వు ఉండవా అని అడుగుతాడు. ఇప్పుడు ఎలా ఉన్నానని కృష్ణ అనగానే.. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నవో చెప్పావ్ కదా.. ఎవరితో మాట్లాడకుండా, నీలో నువ్వు ఉండేదానివని చెప్పావ్ కదా అలా ఉన్నావని మురారి అంటాడు. మీ మనసులో వేరొక అమ్మాయి ఉందని తెలిసి ఇలా అయ్యానని కృష్ణ తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత కృష్ణ, మురారి దగ్గరికి నందు వస్తుంది. ఏంటి మీరు ఇద్దరు ఇలా డల్ గా ఉన్నారని నందు అడుగుతుంది. అదేం లేదని మురారి అంటాడు. నందు నీతో మాట్లాడాలి పక్కకి పదా అని నందుని మురారి పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు. ఎందుకు ఏసీపి సర్ నందుని పక్కకి తీసుకొని వెళ్ళాడని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇలా ఎందుకు ఉన్నావని మురారిని నందు అడుగుతుంది. కొద్దిరోజుల్లో కృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మా మధ్య ఏ బంధం లేదు, అగ్రిమెంట్ మ్యారేజ్ అని నందుకి మురారి చెప్తాడు. అలా మురారి చెప్పగానే నందు షాక్ అవుతుంది. అసలు కృష్ణకి నేనంటే ఇష్టం లేదు కేవలం నాపై గౌరవం మాత్రమే ఉంది. అగ్రిమెంట్ విషయంలో కృష్ణ చాలా క్లారిటీగా ఉంది. అందుకే నేను ఖర్చు చేసిన ప్రతి పైస తిరిగి ఇచ్చింది. ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమని చెప్తే అనవసరంగా తన మనసు డిస్టబ్ చేసిన వాడిని అవుతానని మురారి అంటాడు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకున్నావ్. కృష్ణకి చెప్పు తను అర్ధం చేసుకొని ఇక్కడే ఉండిపోతుంది లేదంటే నేను వెళ్లి చెప్తానని నందు అంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు, చెప్తే నాపై ఒట్టేనని మురారి అంటాడు.

ఆ తర్వాత అసలు నందుని ఎందుకు పక్కకి తీసుకెళ్లారని మురారిని కృష్ణ అడుగుతుంది. అదేం లేదని మురారి అంటాడు. మరి నందు ఎందుకు ఏడుస్తుందని కృష్ణ అడుగుతుంది. ఆదర్శ్ గుర్తుకు వచ్చాడని మురారి అనగానే.. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారా ఏసీపీ సర్ అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఇలా మనం పెద్దత్తయ్యని మోసం చేస్తున్నాం. మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే పెదత్తయ్య తట్టుకోలేరు. నిజం చెప్పేదామని కృష్ణ అంటుంది. సరే కృష్ణ కానీ నువ్వు చెప్పకు నేను చెప్తానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.