English | Telugu

విష్ణుప్రియకి అగస్ట్ నెల హార్ట్ అంట!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది.

విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. సీనియర్ హీరో జెడీ చక్రవర్తి మొదటిసారి నటిస్తున్న వెబ్ సిరీస్ 'దయా' లో షబానాగా విష్ణుప్రియ చేస్తుంది. అయితే తను షబానాగా చేస్తున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది

' జరీ జరీ పంచె కట్టి ' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో మానస్ తో కలిసి చేసిన‌ విష్ణుప్రియ.. ఫుల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ట్రెండింగ్ కి తగ్గట్టుగా తనని తాను మల్చుకుంటూ వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది విష్ణుప్రియ. తాజాగా విష్ణుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. " అగస్ట్ మంత్ యు హావ్ మై హార్ట్ " అనే కాప్షన్ తో తన డాన్స్ వీడియోని షేర్ చేసింది విష్ణుప్రియ. కాగా ఈ అగస్ట్ లో తను నటించిన ' దయా ' వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందనని సంతోషంలో ఈ మంత్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తోంది విష్ణు ప్రియ.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.