English | Telugu

సదా ఎమోషనల్ మూమెంట్ అదేనా!

సదా.. 'జయం' మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఔనన్నా కాదన్నా' తో ఆ సక్సెస్ ని అలాగే కొనసాగించింది సదా.‌ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'నాగ', అల్లరి నరేష్ తో కలిసి 'ప్రాణం', మంచు మనోజ్ తో కలిసి 'దొంగ దొంగది', 'లీలా మహల్ సెంటర్' లాంటి సినిమాలల్లో చేసింది సదా. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం ఇలా అన్ని భాషల్లో తన సత్తాని చాటుకుంది. అయితే 'అపరిచితుడు' సినిమాతో సదా కెరీర్ పరంగా మంచి హిట్ ని‌ సొంతం చేసుకుంది.

అయితే కొంతకాలం‌ తెలుగు సినిమాలకి దూరంగా ఉంది సదా. ఆ తర్వాత 2016 లో మల్లెమాల ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఢీ డ్యాన్స్ షోకి జడ్జ్ గా చేసింది. అయితే 2018 లో టార్చ్ లైట్ అనే సినిమాలో‌ నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడి తెలుగు డ్యాన్స్ షోకి బడ్జ్ గా చేసింది సదా. ఆ తర్వాత తను ముంబై లో ఒక హోటల్ ని కూడా రన్ చేస్తుంది. అయితే ఆ హోటల్ ఇంకొన్ని రోజుల్లో‌ క్లోజ్ చేస్తామని చెప్పిన సదా.. ఆ హోటల్ కి తనకి ఎంత అటాచ్మెంట్ ఉందో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అక్కడ ఫుడ్ క్వాలిటీగా ఉంటుందని, తను ఆ హోటల్ ని స్టార్ట్ చేసేప్పుడు చాలా కష్టపడిందని వివరించింది.

అయితే సదా వీకెండ్స్ లో, సినిమా షూటింగ్ లేని టైంలో కెమెరా తీసుకొని అడవికి వెళ్ళి ఫోటోలు తీస్తుంది. ఎందుకంటే సదా ఒక ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది సదా. అయితే తన సొంతంగా ' సదా గ్రీన్ లైఫ్ ' అనే యూట్యూబ్ ఛానెల్ ని కూడా రన్ చేస్తోంది సదా. వాట్ ఈట్ ఇన్ ఏ డే , జబర్దస్త్ షూటింగ్ బిజీ డే, మై హోమ్ టూర్ వ్లాగ్స్ పాపులర్ అయ్యాయి. తన బ్యాగ్ లో ఏం ఉందో చూపిస్తు ఒక వ్లాగ్, మై కాస్ట్యూమ్ కలెక్షన్ పేరుతో మరొక వ్లాగ్ చేయగా వాటికి మంచి వీక్షకాధరణ లభించాయి. అయితే తాజాగా ' మై ఎమోషనల్ వీడియో ప్రోమో ' అని ఒక వీడీయోని తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసింది సదా. ఇందులో తనకి అవమానం జరిగినట్టుగా, నలభై ఐదు రోజుల్లో అమ్మాయిని డిసైడ్ చేస్తారా అని సదా చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. ఎందుకు సదా ఇలా చెప్పింది. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి వీడియో వచ్చేవరకు ఆగాల్సిందే.