English | Telugu
కృతి శెట్టితో డేట్ కి వెళ్తానని చెప్పిన యాంకర్ శివ!
Updated : Aug 3, 2023
ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి.
ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. ' క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ ' లో అరియానా, దేత్తడి హారిక, రాహుల్ సిప్లిగంజ్, తేజస్విని- అమర్ దీప్ చౌదరి లని ఇంటర్వూ చేసి వారిని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి ట్రెండింగ్ లో ఉంది.
తాజాగా క్రేజీ టాక్స్ విత్ కాజల్ లో యాంకర్ శివని కొన్ని క్వశ్చన్స్ అడుగగా వాటికి సూటిగా సమాధానమిచ్చాడు. యాంకర్ శివ.. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షోలో పాల్గొన్నాడు. దాంతో అందరికి పరిచయమయ్యాడు. బిగ్ బాస్ తర్వాత వివిధ చానెల్ లలో యాంకర్ గా చేసిన శివ, ఆ తర్వాత తన స్వంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి, ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఫేమస్ అయ్యాడు.
అయితే జబర్దస్త్ షోకి గెస్ట్ గా వచ్చి, అనసూయ పొట్టి డ్రెస్ ఏంటని కామెంట్ చేయడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 ఎగ్జిట్ ఇంటర్వూ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే తాజాగా కాజల్ లో జరిగిన ఇంటర్వ్యూలో.. డేట్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తావని కాజల్ అడుగగా.. కృతి శెట్టి తో డేట్ కి వెళ్తానని శివ చెప్పాడు. యూట్యూబ్ ఛానెల్ వాళ్ళకి టిప్స్ చెప్పొచ్చుగా అని కాజల్ అడుగగా.. ఒక్కొక్కరికి ఒక్కో టిప్ చెప్పాడు శివ. కాగా ఈ వీడియోకి ' మంచి మంచి కోరికలే ఉన్నాయిగా' అని టైటిల్ తో కాజల్ ఈ వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది.