English | Telugu
మోస్ట్ ఎమోషనల్ గా సాగిన రిషి, మహేంద్రల సంభాషణ!
Updated : Aug 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నటి ఎపిసోడ్ -832 లో.. రిషి మైకం లో నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న మహేంద్రని చూసి.. డాడ్ మనం ఎక్కడ ఉన్నామని అడుగగా.. వసుధార వాళ్ళింట్లో ఉన్నామని మహేంద్ర అంటాడు. రిషి ఒక్కసారిగా లేచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. పదండి వెళ్దామని రిషి అంటాడు.
ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత వెళ్దామని మహేంద్ర అనగానే.. నేను ఇక్కడ ఉండనని రిషి అంటాడు. వసుధారే నిన్నిప్పుడు కాపాడిందని మహేంద్ర అంటాడు. ఇప్పుడు కాపాడిందేమో కానీ అప్పుడే నన్ను చంపేసిందని రిషి అంటాడు. నాపై ఇలా అటాక్ కి కారణం ఈ వసుధారకి జగతి మేడమ్ కి తెలిసినా చెప్పరని రిషి కోప్పడతాడు. నన్ను కాపాడినందుకు మీ కూతురికి థాంక్స్ చెప్పండని చక్రపాణికి చెప్తాడు రిషి. ఆ తర్వాత రిషి అన్న మాటలకు వసుధార బాధపడుతుంది. మరొకవైపు ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు రిషి ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తుంటారు. అంతలోనే రిషిని మహేంద్ర తీసుకొని వస్తాడు. సర్ ఇంత రాత్రి మీరు ఇక్కడ అని మహేంద్రని విశ్వనాథ్ అడుగుతాడు. రిషిపై ఎటాక్ జరిగిందని చెప్తాడు. ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు షాక్ అవుతారు.
అసలు రిషికి ఇదివరకు కూడా ఇలా జరిగింది. ఈ విషయం మనం సీరియస్ గా తీసుకోవాలని ఏంజిల్ అంటుంది. అవును ఇది వరకు కూడా మీ ఇంట్లో ఒకసారి ఎటాక్ జరిగిందని మహేంద్ర చెప్తాడు. మా ఇంట్లో జరిగిందా మాకు చెప్పలేదని విశ్వనాథ్ అంటాడు. ఆ తర్వాత రిషిని తీసుకొని మహేంద్ర గదిలోకి వెళ్తాడు. మహేంద్ర ఒళ్ళో రిషి తల వాల్చి పడుకుంటాడు. ఏంటి డాడ్ మన జీవితాలు ఇలా అయ్యాయి. మనం ఒక్కప్పుడు ఎలా సరదాగా ఉండేవాళ్ళమని రిషి అంటాడు. ఇంట్లో పెద్దమ్మ-పెద్దనాన్న, అన్నయ్య-వదిన వాళ్ళు నా గురించి బాధపడుతున్నారా అని రిషి అడుగుతాడు. మహేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు.
ఆ తర్వాత నాకు అమ్మ విలువ తెలియక ఇన్ని రోజులు జగతి మేడమ్ ని బాధపెట్టాను. నాకు ఇలా తనకి ఒళ్ళో తల వాల్చుకొని పడుకోవాలని ఉంది. కానీ నాకు విలువ తెలిసాక నన్ను ఒక మోసగాడిలా వాళ్ళు చేశారని, బాధపెట్టిన ప్రతిసారి వాళ్ళ కంటే ఎక్కువ నేను బాధపడ్డానని రిషి అనగానే.. మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మళ్ళీ మనమందరం కలిసి సంతోషంగా ఉంటాం. నువ్వు పడుకో నాన్న అని మహేంద్ర అంటాడు. కాసేపటికి మహేంద్రకి వసుధార కాల్ చేసి రిషి గురించి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.