English | Telugu

బిగ్ బాస్ బిగ్ బాస్ కాంట్రావర్సి షో కాదు...దాని వలన మా జీవితాలే మారిపోయాయి

బీబీ షైనింగ్ స్టార్స్ పేరుతో రీసెంట్ గా స్టార్ మాలో జరిగిన కార్యక్రమం మంచి ఫన్నీఫన్నీగా సాగింది. ఇందులో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి రకరకాల అవార్డ్స్ ని ప్రకటించి అందించారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి కూడా ఒక అవార్డుని అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ కేటగిరీలో నెల్లూరు జిల్లా నుంచి ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లో గేమ్ చెంజర్ గా ఉన్నాడు. ఈ షోలో కూడా "గేమ్ చెంజర్ " క్యాటగిరి కింద అవార్డుని అందించారు. అవార్డు తీసుకున్న ఆది మాట్లాడాడు. "అందరికీ చాలా ధన్యవాదాలు. నా లైఫ్ మొత్తం అందరికీ రుణపడి ఉంటాను. చాలామంది బిగ్ బాస్ ని ఒక కాంట్రవర్షియల్ షోగా చూస్తారు కానీ..కొన్ని వందల మందికి ఇది లైఫ్ ఇచ్చి, లైఫ్ మార్చిన షో అనే విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.. ఇక్కడ ఉన్న 100 మందికి పైగా జీవితాలను ఈ షో మార్చేసింది.

అలాగే బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్..నాలాంటి వాళ్ళెందరి జీవితాలని మార్చేసింది ." అని చెప్పాడు ఆదిరెడ్డి. అలాగే ప్రియాంకకు కూడా "గేమ్ చెంజర్" అవార్డు ని అందుకుంది. "ప్రియాంక కంగ్రాట్స్.. బిగ్ బాస్ తర్వాత ప్రశాంత్ వర్మ గారి మూవీలో, ఒక తమిళ్ మూవీలో కూడా చేస్తున్నావ్..చాలా బిజీ ఐపోయావ్..చాలామందికి ఇన్స్పిరేషన్ గా కూడా మారావు" అని సుమ విష్ చేశారు. ఇక ప్రియాంక మాట్లాడుతూ "బిగ్ బాస్ కి ముందు నేను చాలా తక్కువ మందికి తెలుసు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా జీవితమే మారిపోయింది. మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశారు, ఆడియన్స్ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు" అని చెప్పింది ప్రియాంక. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూయర్ గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బిగ్ బాస్ షోకి వచ్చాడు. ఇక ప్రియాంక సింగ్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మూవీస్, షోస్, ఈవెంట్స్ తో చాలా బిజీగా మారిపోయారు.