English | Telugu

అన్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్న అర్జున్ కళ్యాణ్  వాసంతి కృష్ణన్!


అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య అంటే గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటీ రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా శ్రీ సత్య వల్లే బయటకు వచ్చాడంటూ అప్పట్లో ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే తాజాగా జరిగిన బిబి జోడి షోలో అర్జున్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ సత్య వస్తుందనే వార్తలు వినిపించినా.. చివరికి వసంతి కృష్ణన్ తో జత కట్టాడు. మరొక జోడిగా మెహబూబ్ తో శ్రీ సత్య జత కట్టింది. బిబి జోడీలో కూడా శ్రీసత్య, అర్జున్ ల మధ్యలో ఏదో ఉన్నట్లుగా.. జడ్జెస్, యాంకర్ శ్రీముఖి కూడా సరదాగా ఆటపట్టించారు. కానీ శ్రీసత్య మాత్రం.. అర్జున్ పై ప్రేమ లేదని, ఒక ఫ్రెండ్ అంటూ చెప్పింది. ఆ తర్వాత శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, వాసంతి తరచు పార్టీలంటూ కలుస్తూనే ఉంటారు.

అయితే తాజాగా శ్రీసత్య, వాసంతి కలిసి 'సమ్మోహనుడా' పాటకి హాట్ డాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అర్జున్ కళ్యాణ్ , వాసంతి ఏదో షూటింగ్ లో ఉండగా.. అర్జున్ కళ్యాణ్ వాళ్ళు చేసిన 'సమ్మోహనుడా' డాన్స్ ని ఫన్నీ గా చేసి చూపించాడు అర్జున్ కళ్యాణ్. అలా వాళ్ళిద్దరిని అర్జున్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోని.. ' ప్రొఫెషనల్ వర్క్ కి వచ్చి అన్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నాడు చూడు ' అనే క్యాప్షన్ తో వాసంతి ఒక పోస్ట్ పెట్టింది. కాగా అదే వీడియోని అర్జున్ కళ్యాణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియోని బిగ్‌బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అంతా చూసి నవ్వకుంటూ కామెంట్ చేస్తున్నారు.