బతికున్న కోరమీనుతో పాటు 40 గిఫ్టులు ఇచ్చిన శ్రీవాణి
బుల్లితెర నటి శ్రీవాణి గురించి ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఇంకా తన భర్త విక్రమ్ కలిస్తే ఇంకా ఫన్ ఉంటుంది. అలాంటి విక్రమ్ , శ్రీవాణి వాళ్ళ యుట్యూబ్ లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు విక్రమ్ బర్త్ డే సందర్భంగా శ్రీవాణి బోల్డు గిఫ్టులు ఇచ్చింది. విక్రమ్ 41 ఏళ్ళ సందర్భంగా 41 గిఫ్టులు ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అందులో సోప్, బ్రష్, మగ్గు, షాంపూ, తల దువ్వెన, లాల్చీ పైజామా, చాక్లేట్లు, హ్యాండ్ వాచ్, షోలాపూర్ చెప్పులు, జుట్టుకు వేసుకునే రంగు, ఉన్నాయి. తర్వాత విక్రమ్ కి ఎంతో ఇష్టమైన ఒక కోట్ తీసుకుంది. భోళా శంకర్ మూవీ చూసాక అందులో చిరంజీవి పైన వేసుకున్న కోట్ చూసాక అది తనకు ఎంతో నచ్చిందని చెప్పేసరికి శ్రీవాణి దాన్ని కుట్టించి గిఫ్ట్ గా ఇచ్చేసింది. అది చూసేసరికి విక్రమ్ శ్రీవాణిని ముద్దు కూడా పెట్టేసుకున్నాడు. మూవీలో చిరంజీవి కోట్ గ్రీన్ కలర్ ఇక్కడ నాది బ్లూ కలర్ అన్నాడు విక్రమ్.