English | Telugu
కొంచెం కొంచెం కొరుక్కుపోవయ్య అంటున్న దివి!
Updated : Aug 28, 2023
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా.. ఈ పాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడున్న సెలబ్రిటీలు కొత్త కొత్త పాటలతో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండగా దివి వాద్య మాత్రం పాత పాటలతో మ్యాజిక్ చేస్తుంది. భాను చందర్, అర్చన కలిసి నటించిన 'నిరీక్షణ' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ' ఆనాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే'. ఈ సినిమాలో హీరోయిన్ అర్చన కాస్టూమ్స్ అప్పట్లో క్రేజ్ ఉండేది. కాగా ఇప్పుడు అదే కాస్టూమ్ తో దివి దర్శనమిచ్చింది. అందాలు ఆరబోస్తూ చీర, జాకెట్ లో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.
దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. తాజాగా ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో నటించిన దివి.. అక్కడ అందాల ఆరబోతకే పరిమతమైంది. అయితే మంచి కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న దివికి, మరిన్ని అవకాశాలు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ ఒక మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న దివి.. తన అందంతో క్రేజీ పోస్ట్ లతో మరింత ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. కాగా ఇప్పుడు తాజాగా కొంచెం కొంచెం కొరుక్కుపోవయ్యా అంటూ మరికొన్ని బోల్డ్ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది దివి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది.