English | Telugu

ఛీఛీ నువ్వు ఇంత చీపా.. ఇలాంటోడివనుకోలేదు నూకరాజు!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది.

నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. 'ఫోన్ లో దొరికిండు గుడ్డు పగిలింది' అనే వ్లాగ్ ని ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఇందులో ఆసియా చిన్ననాటి ఫోటోలని నూకరాజు చూపిస్తూ కామెంట్ చేసాడు. ఆ తర్వాత నూకరాజు ఫోన్ తీసుకొని చెక్ చేసిన ఆసియా.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. " ఏంది ఇది.. నువ్వు ఇంతా చీపా.. ఛీ ఛీ.. వీడియో ఆపన్నా.. నువ్వు ఇలాంటోడివనుకోలేదు రాజు " అంటూ ఆసియా అంటుంది. దానికి నూకరాజు షాక్ అవుతాడు. ఫోన్ లో ఏముందని అడుగగా.. తనేం మాట్లడదు. కాసేపటి తర్వాత ఫ్రాంక్ అని అనేస్తుంది ఆసియా. కాగా యూట్యూబ్ లో తమ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.