English | Telugu
మానవత్వాన్ని చాటుకున్న సుమ కనకాల!
Updated : Aug 27, 2023
'మానవ సేవే మాధవ సేవ' అని చాలా మంది నమ్ముతారు. కొందరు సెలబ్రిటీలు పేరు కోసం, మనీ కోసం నటిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తాము చేసే మంచి పనిలో అందరిని భాగస్వాములని చేస్తారు. అలాంటి పని ఇప్పుడు సుమ కనకాల చేసింది. అనాథలుగా మిగిలిపోతున్న వృద్ధుల కోసం 'ది నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని నిర్మించింది. ఈ ఓల్డేజ్ హోమ్ కోసం తనతో పాటు ఎంతో మంది విరాళాలు పంపించారని , విదేశాల నుండి కూడా భారీగా డబ్బులు పంపించారని సుమ అంది. అనాథల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఓల్డేజ్ హోమ్ ని సుమ తాజాగా ప్రారంభించింది.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ 'స్ట్రెస్ బస్టర్స్' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే సుమ.. 'వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా అది వైరల్ అయింది. అయితే తాజాగా సుమ 'ది నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని ప్రారంభించి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ హోమ్ కోసం సాయమందించిన ప్రతీ ఒక్కరికి సుమ ధన్యవాదాలు తెలిపింది. కాగా ఎప్పుడు చమక్కులతో చక్కిలిగింతలు పెట్టే సుమ, మానవ సేవే మాధవ సేవ అనే గోల్డేన్ వర్డ్స్ ని నిజం చేసినందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.