English | Telugu
త్వరలో గుడ్ న్యూస్ చెప్తానంటున్న గుప్పెడంత మనసు నటి!
Updated : Aug 28, 2023
జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.
జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.
తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతి, రియల్ లైఫ్ లో తన స్టైలే వేరు. అది అందరికి నచ్చకపోవచ్చు. ఒక యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్న జ్యోతి రాయ్.. తాజాగా అతనితో కలిసి ఉన్న ఫోటోని అప్లోడ్ చేసింది. ఈ ఫోటోకి ' త్వరలో ఒక గుడ్ న్యూస్ ఉంది' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో వీళ్ళిద్దరు త్వరలో పెళ్ళి చేసుకుంటారా అనే అభిప్రాయం అందరిలోను నెలకొంది. అయితే వీళ్ళు పెళ్ళిచేసుకొని సర్ ప్రైజ్ ఇస్తారా? లేక జ్యోతిరాయ్ ప్రెగ్నెంట్ అని షాకిస్తుందా అనే అందరు భావిస్తున్నారు. కాగా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ గుప్పెడంత మనసు 'జగతి'. మరి జ్యోతిరాయ్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.