English | Telugu

ఎయిర్ పోర్ట్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న పవిత్ర!

జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసి తమ ట్యాలెంట్ తో ఎంతో‌ మంది సినిమాల్లో నటించారు. అలాంటి వారిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు వెల్దండి, ధనరాజ్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్టులో రోహిణి కూడా ఉంది. 'సేవ్ ది టైగర్స్' లో తను చేసిన నటనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో తనకి సినిమా ఆఫర్లు పెరిగాయి. కాగా ఇప్పుడు తను రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. 'రౌడీ రోహిణీ' అనే యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంది. కాగా పవిత్ర గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది రోహిణి.

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జీ తెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జబర్దస్త్ పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసిన కష్టాలని దగ్గరనుండి చూసిన పవిత్ర.. తన చదువు ఇంటర్మీడియట్ వరకే ఆపేసిందంట. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అంట్లు తోమడానికి వెళ్ళినప్పుడు సాయం చేయడానికి తను కూడా వెళ్ళిందంట. జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమేడియన్లు ఉండేవాళ్ళు కాదు అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీని చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, హైపర్ ఆది టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది.

ఇమాన్యుయల్ తో కలిసి మంచి బాండింగ్ ఉన్న పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే రోహిణి తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నారంట వాళ్ళు. అయితే అక్కడ పవిత్ర బ్లాక్ డ్రెస్ అండ్ క్యాప్ పెట్టుకుంది చూసి తను అక్కడ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తుందంటూ ఫన్నీగా అనేసింది. ఇప్పటిదాకా కాఫీ షాప్ లో పనిచేసింది. ఇప్పుడే వచ్చిందని రోహిణి అనగా.. జోక్ చేయకు అక్క, నువ్వు నేను కలిసే కదా జాయిన్ అయిందని కౌంటర్ చేసింది పవిత్ర. అలా పవిత్ర, రౌడీ రోహిణి కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.