లావణ్యనే నా ఫోన్ లో తన పేరు మార్చింది.. ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్న వార్న్
ప్రతీ శనివారం ‘సుమ అడ్డా’ షోలో కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ శనివారం హీరో వరుణ్ తేజ్‌ను తీసుకొచ్చింది. వరుణ్ తేజ్ కొత్త మూవీ ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ కోసం వచ్చారు. తనతో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సాక్షి వైద్య కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ‘సుమ అడ్డా’లో వరుణ్ తేజ్ తో ఫేమస్ మూవీ స్ఫూఫ్ చేయించింది.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్‌సింగ్’ మూవీ స్ఫూఫ్‌ను చేయించింది. "నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది" అని డైలాగ్ చెప్పాడు. "సాక్షి వైద్య ... మీ అత్తారిల్లు ఎక్కడ అయితే బాగుంటుంది" అంటూ సుమ అడిగేసరికి దానికి సమాధానంగా సాక్షి.. తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పింది.