English | Telugu

2 లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కి వెళ్ళను

జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా పరిచయమమైన జోష్ మూవీలో నటించి జోష్ రవిగా లైంలైట్ లోకి వచ్చాడు. అలాంటి రవి జబర్దస్త్ గురించి కొన్ని కామెంట్స్ చేసాడు. వందకు పైగా మూవీస్ చేసినా కూడా కొన్ని మూవీస్ మాత్రమే అతన్ని నిలబెట్టాయి. "గుండె జారీ గల్లంతయ్యిందే" మూవీలో రవి యాక్షన్ కి ఆడియన్స్ కూడా ఫిదా ఇపోయారు. కెరీర్ స్టార్టింగ్ ఎన్నో కష్టాలు పడిన రవి నెమ్మదిగా నిలదొక్కుకుని కొంత పేరు సంపాదించుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి  హాట్ కామెంట్స్ చేసాడు రవి. జబర్దస్త్ 2 లక్షలు లేదా 1 లక్ష ఇస్తామని చెప్పినా తాను వెళ్ళను అని చెప్పాడు.

ట్రెండింగ్ లో ఆదిరెడ్డి కొత్త వ్లాగ్.. అదిరిందిగా!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కి లక్షల్లో వ్యూస్ వచ్చేవని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్  గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి  కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

ఆన్లైన్ లో పెళ్లికూతురు బుకింగ్..నోరెళ్లబెట్టిన పవిత్ర

ఏది కొనాలన్నా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే చాలు వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ...నచ్చని ప్రోడక్ట్ ని కూడా తిరిగిచ్చేసే ప్రాసెస్ కూడా ఇందులో సులువుగా ఉంటుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఒక స్కిట్ రేపు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అజర్, రాంప్రసాద్ మరో కమెడియన్ ముగ్గురూ కలిసి బ్యాండ్ మేళం వాయిస్తూ వస్తారు. "ఎక్కడ బుక్ చేశారు వీళ్ళను" అని దొరబాబు ఆచంట మహేష్ ని అడిగాడు "ఆన్లైన్ లో బుక్ చేసాం" అని చెప్పాడు మహేష్. ఇంతలో మహేష్ పక్కకు పెళ్లి కూతురు గెటప్ లో వచ్చి నిలబడుతుంది పాగల్ పవిత్ర.