English | Telugu

మురారిది ఓవరాక్షన్ అంటున్న కృష్ణ.. ముకుందే సాక్ష్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ఒక ప్రత్యేకత ఉంది‌. ఈ టీవిలో ప్రసారమయ్యే సీరియల్స్ లో టాప్ -5 లో రెండు ఉన్నాయి. మొదటిది బ్రహ్మముడి, నాల్గవ స్థానంలో కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్స్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కథ రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్న కృష్ణ, మురారిల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరిద్దరి పెళ్ళి ముందు ముకుందని మురారి ప్రేమిస్తాడు. కాగా మురారి వాళ్ళ అన్న ఆదర్శ్ ని ముకుంద పెళ్ళిచేసుకొని అదే ఇంటికి వస్తుంది. దీంతో ఆదర్శ్ కి ముకుంద ప్రేమ విషయం తెలిసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇక ముకుంద ఒంటరిగా ఉంటూ మురారి తన ప్రేమను పొందాలని తపిస్తుంటుంది. కాగా కొత్తగా పెళ్ళిచేసుకొని వచ్చిన కృష్ణ ఇంట్లో అందరితో కలిసిపోయతుంది. మురారిని ప్రేమిస్తుంది కృష్ణ. అయితే తాజా ఎపిసోడ్‌లలో మురారి, కృష్ణలు చేసుకున్న అగ్రిమెంట్ పూర్తవడంతో.. మెడికల్ క్యాంప్ పేరుతో కృష్ణ ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. దాంతో మురారి ఒంటరి వాడవుతాడు.

ఇక కృష్ణ కోసం మెడికల్ క్యాంప్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరుగగా ఏసీపీ మురారి అక్కడ వాళ్ళందరిని క్షేమంగా కాపాడతాడు. ఆ కాపాడే ప్రాసెస్ లో మురారికి గాయాలవుతాయి. దాంతో కృష్ణ అతనికి ట్రీట్ మెంట్ చేస్తుంది. మురారిని కాపాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తూ మేకర్స్ ఈ సీరియల్ ని సరికొత్తగా చేస్తున్నారు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముఖ్య పాత్రలు చేస్తున్న మురారి(గగన్ చిన్నప్ప), కృష్ణ(ప్రేరణ కుంభం), ముకుంద( యశ్మీ గౌడ) ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. కాగా సీరియల్ లోని తాజా ఎపిసోడ్‌లలో మురారికి గాయం కాగా కృష్ణ తనకి ట్రీట్ మెంట్ చేసి కాపాడుతుంది. అయితే ఈ వీడియోలో రివర్స్ లో మురారికి గాయాలు చేస్తూ సరదాగా ఆటపట్టించింది కృష్ణ. ఇదంతా యాక్టింగ్ కాదు ఓవరాక్టింగ్ అంటూ మురారిని కృష్ణ అంటుంది. దెబ్బలు తాకిన వారు ఆ బ్యాండెడ్ కట్టుకుంటారు. కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు ఇలా ఉంటారంటూ మురారి(గగన్) ని అంది కృష్ణ. అలా సెట్ లో ఈ సీరియల్ టీమ్ అంతా కలిసి అలా సెట్ లో సరదాగా గడిపారు. ఇదంతా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేసారు. అయితే వీళ్ళు చేసిన ఈ వీడియోని ముకుంద( యశ్మీ గౌడ) తీసింది. ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.