English | Telugu

నీతోనే డాన్స్ విజేతలు ఆట సందీప్-జ్యోతి జోడి...

నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే పూర్తి చేసుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని ప్రైజ్ మనీ అందించనున్నారు. అమర్‌దీప్- తేజస్విని, నిఖిల్- కావ్య, ఆట సందీప్-జ్యోతి , సాగర్- దీప , నటరాజ్- నీతు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. ఇక ఫైనల్ గా జడ్జెస్ ఒక్కొక్కొరు చెప్పలేక గెస్ట్ విజయ్ కి ఈ పని అప్పజెప్పి పక్కకు వచ్చేసారు. ఐతే ఇన్ని వారాలుగా గొడవలు పడుతూ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో పోటీ పడుతూ ఇప్పుడు ఫైనల్స్ కి వచ్చారు. ఇక ఫైనల్ లో ఆట సందీప్- జ్యోతి జోడి టైటిల్ విన్ అయ్యారు. అలాగే 20 లక్షల చెక్ కూడా అందుకున్నారు. ఐతే వీళ్లకు ట్రోఫీ రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నీతోనే డాన్స్ షోలో ఆట సందీప్ జంట ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్, నటరాజ్ మాస్టర్ కూడా ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. ఈ రెండు జోడీలు తప్పించి మిగిలిన వారు సీరియల్ ఆర్టిస్ట్స్. అసలు మామూలు డాన్సర్స్ తో కొరియోగ్రాఫర్స్ ని మిక్స్ చేయడమే తప్పు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఐతే టైటిల్ కోసం ఈ అని జంటలు ఏ వారానికి ఆ వారం ఫైనల్ అన్నట్టుగానే డాన్స్ చేశారు. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ గా ఉన్న వాళ్ళు టైటిల్ గెలవడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు అని అంటున్నారు. కేవలం డాన్స్‌ని మాత్రమే కాకుండా బిహేవియర్ కూడా చాలా అవసరం అంటున్నారు నెటిజన్స్. ఐతే ఆట సందీప్ డాన్స్ పరంగా ఇరగదీస్తాడు కానీ బిహేవియర్ విషయంలో మాత్రం అంత కరెక్ట్ కాదు అని డాన్స్ లవర్స్, నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 కి ఆట సందీప్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడికి వచ్చాక రెండో వారంలోనే ఇంటికి పంపేస్తాం అని అంటున్నారు.